BREAKING
thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి thumb ● కొత్తపేటలో రేపు ట్రాఫిక్ మళ్లింపు thumb ● బీసీల ఓట్లతోనే గెలుస్తాం.. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు thumb ● జర్నలిస్టుపై సీఐ దురుసు ప్రవర్తనను ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన thumb ● జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్‌లో బుధరావుపేట విద్యార్థుల ప్రతిభ thumb ● దూదిమెట్ల బాలరాజు యాదవ్ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్వీ నాయకుడు శివప్రసాద్ యాదవ్ thumb ● తుమ్మలగూడెంలో 45 దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ thumb ● జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం thumb ● సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల thumb ● విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి thumb ● బానోతు రామన్న నాయక్‌పై హత్యాయత్నం ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
Test 4
Date of Publish : 06 November 2026, 07:58 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

దీపావళి టపాసుల్లోనూ రాజకీయ సందడి.. పార్టీల గుర్తులతో 1000 వాలా బాణసంచా!

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
06 Nov, 2026 - 07:58 PM
7 వీక్షణలు

చిన్న కళ్లగుంట, కామేపల్లిలోని హోల్‌సేల్ దుకాణాల్లో వినియోగదారులను ఆకర్షిస్తున్న ప్రత్యేక టపాసులు

కొండపి (ఎన్ టుడే న్యూస్): దీపావళి పండుగ వచ్చిందంటే టపాసుల సందడి సహజం. అయితే ఈసారి బాణసంచా దుకాణాల్లో పండుగ హడావుడితో పాటు రాజకీయ సందడి కూడా కనిపిస్తోంది. కొండపి మండలంలోని చిన్న కళ్లగుంట, కామేపల్లి ప్రాంతాల్లో ఉన్న దీపావళి క్రాకర్స్ హోల్‌సేల్ దుకాణాల్లో రాజకీయ పార్టీల గుర్తులతో కూడిన 1000 వాలా టపాసులు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

సాధారణంగా దీపావళి సందర్భంగా వివిధ రకాల టపాసులు, బాణసంచా కొనుగోళ్లు జోరుగా సాగుతుంటాయి. ఈసారి మాత్రం రాజకీయ పార్టీల గుర్తులతో ముద్రించిన 1000 వాలా టపాసులు, చిన్న సైజు సిలిండర్ల ఆకారంలో ఉన్న బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పండుగ కోసం టపాసులు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులు వీటిని ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

ఇటీవల మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో టపాసులపై కనిపిస్తున్న పార్టీల గుర్తులు చర్చకు దారితీస్తున్నాయి. పండుగ బాణసంచాలోనూ రాజకీయ పార్టీల గుర్తులు దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది. దీంతో దీపావళి సందడి మధ్య రాజకీయ అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది.

ఒకవైపు దీపావళి వెలుగులు, మరోవైపు పార్టీల గుర్తులతో కూడిన టపాసులు.. ఈ రెండూ కలగలిసి దుకాణాల్లో ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. టపాసులపై కనిపిస్తున్న రాజకీయ గుర్తులు కేవలం పండుగ ఆకర్షణగానే మిగులుతాయా? లేక ఎన్నికల సమయంలోనూ చర్చకు కారణమవుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.