BREAKING
thumb ● ఆరుట్ల ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన thumb ● కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం లచ్చయ్య కు ఘన నివాళి thumb ● ఆళ్లగడ్డలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం thumb ● 60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. thumb ● బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకం పెంపు.. thumb ● పేదవారి ఇంట వెలిగే దీపమే నిజమైన దీపావళి.. thumb ● నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం.. thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఆరుట్ల ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన thumb ● కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం లచ్చయ్య కు ఘన నివాళి thumb ● ఆళ్లగడ్డలో రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం thumb ● 60 ఏళ్ల తర్వాత కొండగట్టులో చందనోత్సవం.. thumb ● బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకం పెంపు.. thumb ● పేదవారి ఇంట వెలిగే దీపమే నిజమైన దీపావళి.. thumb ● నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం.. thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు
Test 4
Date of Publish : 06 November 2026, 06:43 pm
Posted by : కూనురు మధు

బీసీ హాస్టల్ విద్యార్థులకు ఇనుప ట్రంకు పెట్టెల పంపిణీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
06 Nov, 2026 - 06:43 PM
44 వీక్షణలు

NTODAY NEWS: చిట్యాల

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో బీసీ హాస్టల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు భద్రపరుచుకునేందుకు ఇనుప  పెట్టెలను గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులతో పాటు నాణ్యమైన ఆహారం, విటమిన్లు, పండ్లు, పాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులు మానసిక ప్రశాంతతతో, ఉల్లాసంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. అలాగే నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో బీసీ హాస్టల్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, మొదటి వార్డు సభ్యురాలు గంట్ల కవిత, తిరుమల్ రెడ్డి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, హాస్టల్ వార్డెన్ ధర్మపురి తార, విద్యార్థులు పాల్గొన్నారు.