తిరువూరు గ్రంథాలయంలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు గ్రేడ్-1 శాఖా గ్రంథాలయంలో మహాకవి, సంఘసంస్కర్త గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ వెంకట అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలుగు సాహిత్యానికి గురజాడ వెంకట అప్పారావు అందించిన విశిష్ట సేవలను, సమాజ సంస్కరణ కోసం ఆయన చేసిన కృషిని కార్యక్రమంలో పాల్గొన్న వారు స్మరించుకున్నారు. సమాజంలో మార్పు కోసం గురజాడ రచనలు, ఆలోచనలు అందించిన స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రతాపరెడ్డి, గ్రంథాలయ సిబ్బంది జె. శ్రీలత, పాఠకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.