24వ తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుపతి: తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ ఈ నెల 24వ తేదీ వరకు నిలిపివేసింది. ఈ నెల 25వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను 24వ తేదీన జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆదివారం టోకెన్ల కోసం కేంద్రాలకు వచ్చిన పలువురు భక్తులు నిరాశకు గురయ్యారు. అనంతరం వారు నేరుగా తిరుమలకు బయలుదేరారు. సర్వదర్శన టోకెన్ల జారీకి సంబంధించిన ఈ మార్పును భక్తులు గమనించి, తమ తిరుమల పర్యటనను అందుకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.