విశ్వకర్మ జయంతి వేడుకల్లో నారా లోకేష్..
విశ్వకర్మ జయంతి వేడుకల్లో నారా లోకేష్.. శిల్పులు, కార్మికులకు శుభాకాంక్షలు
ఉండవల్లి: విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ భగవానుడిని స్మరించుకున్న ఆయన, సృష్టి, నిర్మాణం, నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే విశ్వకర్మ భగవానుడి గొప్పతనాన్ని గుర్తుచేశారు. సమాజ నిర్మాణంలో శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికుల పాత్ర ఎంతో కీలకమని నారా లోకేష్ పేర్కొన్నారు. తమ నైపుణ్యంతో సమాజ అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే తత్వం, సృజనాత్మకత, నైపుణ్యం కలిస్తే అభివృద్ధికి మరింత బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు. విశ్వకర్మ భగవానుడి స్ఫూర్తితో వృత్తి నైపుణ్యాలకు మరింత గౌరవం, ప్రోత్సాహం లభించాల్సిన అవసరం ఉందని తెలిపారు.