BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
Test 4
Date of Publish : 12 November 2026, 02:58 pm
Posted by : PEDDABOINA SRIKANTH

గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
12 Nov, 2026 - 02:58 PM
9 వీక్షణలు

దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: సర్పంచ్ కర్రె లక్ష్మి బిక్షపతి

ఎల్కతుర్తి: మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో రైతుల సౌకర్యార్థం రైతు సేవా పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కర్రె లక్ష్మి బిక్షపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు ధాన్యం విక్రయించే సమయంలో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆశ్రయించి తమ పంటను విక్రయించడం ద్వారా గిట్టుబాటు ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు తొందరపడి దళారులకు ధాన్యం విక్రయించకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ధాన్యం విక్రయాలకు స్థానికంగానే అవకాశం కల్పించినట్లు అయిందని పేర్కొన్నారు. గ్రామంలోని రైతులందరూ ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.