నర్సంపేట మునిసిపల్ కమిషనర్ అందుబాటులో లేరా?..
తెలంగాణ
/
హన్మకొండ
నర్సంపేటలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4నెలలుగా డిజిటల్ సంతకం అందుబాటులో లేక ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కమిషనర్ కార్యాలయానికి అందుబాటులో ఉండటం లేదని, పారిశుద్ధ్యం, ఇతర సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.