BREAKING
thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
Test 4
Date of Publish : 12 November 2026, 01:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనంలో కోతకు రంగం సిద్ధం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 01:35 PM
3 వీక్షణలు

15 శాతం లేదా గరిష్ఠంగా రూ.10 వేల చెల్లింపు.. అమలు నిబంధనలను రూపొందించిన వయోవృద్ధుల సంక్షేమశాఖ

హైదరాబాద్: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ, వారి పోషణ బాధ్యతలను విస్మరించే ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అమలుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన నిబంధనలను వయోవృద్ధుల సంక్షేమశాఖ సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపినట్లు సమాచారం. ప్రభుత్వ ఆమోదం లభించిన అనంతరం చట్టం అమలుకు సంబంధించిన విధివిధానాలపై స్పష్టత రానుంది.

ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను విస్మరించినట్లు ఫిర్యాదు అందినప్పుడు, విచారణ అనంతరం సంబంధిత ఉద్యోగి నెలవారీ స్థూల వేతనంలో 15 శాతం లేదా గరిష్ఠంగా రూ.10,000.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు చెల్లించేలా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఆ మొత్తాన్ని ఉద్యోగి వేతనం నుంచి మినహాయించి నేరుగా ఆధారపడిన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం ఇందులో పొందుపరిచారు. అయితే ఫిర్యాదు వచ్చిన వెంటనే వేతనంలో కోత విధించరు. సంబంధిత అధికారుల విచారణ, నిర్ణయం ఆధారంగానే ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

చట్టం పరిధిలోకి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్-2026’ ద్వారా తల్లిదండ్రుల పోషణ విషయంలో ఉద్యోగుల బాధ్యతను చట్టబద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం పరిధి ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కూడా వర్తించేలా నిబంధనలు రూపొందించారు.

ఫిర్యాదులపై విచారణ.. అధికారుల నిర్ణయం

తల్లిదండ్రుల పోషణ బాధ్యతను విస్మరిస్తున్నారని భావించినప్పుడు వారు సంబంధిత అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చు. జిల్లా కలెక్టర్ నియమిత అధికారిగా ఫిర్యాదులను పరిశీలించి, తల్లిదండ్రులు, సంబంధిత ఉద్యోగి వాదనలు విన్న అనంతరం నిర్ణయం తీసుకునే విధానం చట్టంలో ఉంది. విచారణలో తల్లిదండ్రులకు ఆర్థికంగా తమను తాము పోషించుకునే తగిన ఆదాయ వనరులు లేవా? వారికి పిల్లల నుంచి ఆర్థిక సహాయం అవసరమా? అనే అంశాలను పరిశీలించనున్నారు. ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునేందుకు 60 రోజుల గడువు కూడా చట్టంలో పొందుపరిచారు.

ఇప్పటికే ఐదు ఫిర్యాదులు?

కొత్త చట్టం అమలుకు సంబంధించిన నిబంధనలు తుది ఆమోదం పొందకముందే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఐదు ఫిర్యాదులు వచ్చినట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది. ఈ ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, వాటి ప్రస్తుత స్థితిపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా, వారికి అవసరమైన ఆహారం, వైద్యం, నివాసం తదితర కనీస అవసరాలు అందేలా చూడటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ ఆమోదం అనంతరం అమలు నిబంధనలు ఖరారైతే ఫిర్యాదుల స్వీకరణ, విచారణ, వేతనం నుంచి నగదు మినహాయింపు, తల్లిదండ్రుల ఖాతాల్లో జమ వంటి అంశాలపై మరింత స్పష్టత రానుంది.