BREAKING
thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
Test 4
Date of Publish : 12 November 2026, 01:37 pm
Posted by : SEETHA KIRAN KUMAR

రూ.40 వేల కోట్లకు టోకెన్లు ఇచ్చాం.. ప్రస్తుతం చెల్లించే పరిస్థితి లేదు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
12 Nov, 2026 - 01:37 PM
3 వీక్షణలు

హైకోర్టుకు వెల్లడించిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా

తమ ముందున్న రూ.51.35 కోట్ల భూపరిహారం 12 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై హైకోర్టులో కీలక విషయం వెల్లడైంది. వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు సంబంధించి చెల్లించాల్సిన రూ.40 వేల కోట్లకు పైగా బిల్లులకు టోకెన్లు జారీ చేసినప్పటికీ, ప్రస్తుతం ఆ మొత్తాన్ని విడుదల చేసే పరిస్థితి లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హైకోర్టుకు తెలిపారు. పెండింగ్ చెల్లింపులను పూర్తిచేయడానికి కనీసం ఆరు నెలల సమయం అవసరమని వివరించారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టినప్పటికీ, భూములు కోల్పోయిన యజమానులకు పరిహారం చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిహారం అందకపోవడంతో పలువురు బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లను జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ విచారించారు.

కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. బుధవారం ఆయన వర్చువల్ విధానంలో విచారణకు హాజరై ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించారు. వివిధ కేటగిరీల్లో చెల్లించాల్సిన బిల్లులకు రూ.40 వేల కోట్లకు పైగా టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం నిధులు విడుదల చేసే పరిస్థితి లేదని, భూసేకరణ పరిహారం చెల్లింపు ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమే అయినప్పటికీ, చెల్లింపులు పూర్తిచేయడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వివరించారు. ఇది తన అసమర్థతేనని కోర్టుకు తెలిపారు.

రూ.51.35 కోట్లు 12 వారాల్లో చెల్లించాలని ఆదేశం

సందీప్ కుమార్ సుల్తానియా వివరణను విన్న హైకోర్టు, తమ ముందున్న కేసులకు సంబంధించి భూములు కోల్పోయిన బాధితులకు చెల్లించాల్సిన సుమారు రూ.51.35 కోట్ల పరిహారాన్ని 12 వారాల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చెల్లింపుల విషయంలో ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకోవాలని అధికారికి సూచించింది.

అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు సంబంధించి ఎంత పరిహారం చెల్లించారు? ఇంకా ఎంత మొత్తం పెండింగ్‌లో ఉంది? మిగిలిన పరిహారాన్ని ఎప్పటిలోగా చెల్లించగలరు? అనే వివరాలతో సమగ్ర అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.

అధికారుల తీరుపై న్యాయస్థానం అసంతృప్తి

విచారణకు వ్యక్తిగతంగా హాజరుకాకుండా మినహాయింపు కోరడంపై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసులను అధికారులు తేలికగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. భూములు కోల్పోయిన ప్రజలకు పరిహారం చెల్లించకపోవడం వల్ల వారు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొంది. ప్రజల హక్కుల పరిరక్షణే న్యాయస్థానం ప్రధాన ఆందోళన అని, ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చుకుంటుందనే అంశం తమ పరిధిలో లేదని స్పష్టం చేసింది.

భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి సకాలంలో పరిహారం అందకపోవడం, గతంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం వల్ల కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెరుగుతున్నాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో కనీసం తమ ముందున్న కేసుల్లోని రూ.51.35 కోట్ల పరిహారమైనా నిర్ణీత 12 వారాల్లో చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.