www.ntodaynews.com
ఆటోనగర్ అభివృద్ధికి సహకరించండి
తెలంగాణ
ఆటోనగర్ లో ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం
NTODAY NEWS: ఏలూరు
ఆటోనగర్ అభివృద్ధికి సహకరించండి... యూనియన్ అధ్యక్షులు అరుణతర నాగేశ్వరరావు కార్యదర్శి అడపా సత్యనారాయణ
ఏలూరు టౌన్ ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ రి.నం.83/1982, ఏలూరు అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆటోనగర్, బి.బిట్ కాంప్లెక్స్ పైన అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినది.
ఈ సమావేశంను ఉద్దేశించి అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటోనగర్ ఏర్పడి దశాబ్ద కాలం పైబడిన రోడ్లు, డ్రైనేజీ,వీధి దీపాలు, వంటి కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నగరం నుండి పది సంవత్సరాల క్రితం మెకానిక్ షెడ్లన్నీ ఆటోనగర్ కు తరలివచ్చి ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేసుకున్న ఆటోమొబైల్ వృత్తిదారులకు 2017 లో విధించిన రిజంప్షన్ వలన లోన్లు రాక పంచాయతీ నుండి అనుమతులు ఇవ్వక కనీస విద్యుత్తు సదుపాయం లేక మిగిలిన వారు యూనిట్లు ఏర్పాటు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షులు కోట్లాది రూపాయల అసోసియేషన్ సొమ్మును దుర్వినియోగం చేసి నేటికీ లెక్క జమలు చెప్పకుండా కాలం గడుపుకుంటూ ప్రస్తుత కమిటీ ఎన్నికల పంపిన సమాధానం చెప్పకుండా కోర్టులలో కేసులు వేస్తూ కాలం వెళ్ళదీస్తూ ఆటోమొబైల్ వృత్తిదారులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఆటోమొబైల్ వృత్తిదారులు పడుతున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి ఎపిఐఐసి వారు ఇచ్చిన రిజంప్షన్ ఉత్తర్వులను రద్దుచేసి ఆటో నగర్ అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ కార్యదర్శి అడపా సత్యనారాయణ మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధి కొరకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఆటోనగర్ నందు రోడ్లు దారుణంగా తయారయ్యాయని దీనివలన వర్షం పడితే ఆటోనగర్లోని రోడ్లు చిత్తడిగా మారి మరమ్మత్తులకు వాహనాలు ఆటోనగర్ కు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గత సంవత్సర కాలంగా కార్యవర్గం జరిపిన కార్యకలాపాలను సర్వసభ్య సమావేశం ముందు తెలియజేశారు.అసోసియేషన్ జమా ఖర్చులను సర్వసభ్య సమావేశం చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో రూపొందించుకున్న భవిష్యత్తు కార్యాచరణ అమలుకు కార్యవర్గం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని తెలియజేశారు. ఉపాధ్యక్షులు కర్రి ఈశ్వరరావు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులకు బందోబస్తు కల్పించిన ఏలూరు రూరల్ పోలీసు వారికి, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షులు మహమ్మద్ సులేమాన్, కమిటీ సభ్యులు సిగిరెడ్డి సంజీవరావు, బోడ రాజు, గుమ్మల్ల సూర్యనారాయణ, షేక్ జుల్ఫీ,సయ్యద్ చోటే, బుస్సే ప్రతాప్, గంటా జోగిరాజు, లారీ మెకానిక్ బాబు, శెట్టి వెంకటేశ్వరరావు, సయ్యద్ జానీ, ఉప్పులూరి హేమ శంకర్, మరకాల మురళి, పల్నాటి సతీష్, వెన్నమనేని గంగాధర్ రావు, అర్జా బెనర్జీ,తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube