BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు

తెలంగాణ
26 Jan, 2026 - 07:04 AM
36 వీక్షణలు
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం-- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించడమే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు.సోమవారం 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టరేట్ ఆవరణలో స్థానిక సంస్థల ,రెవెన్యూ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు డా.బి ఆర్ అంబేడ్కర్,మహాత్మా గాంధీ చిత్ర పటాలకు పూల మాల వేసి నివాళులు అర్పించి, జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు.అనంతరం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎస్పీ అక్షాంష్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, డి.ఆర్.ఓ జయమ్మ ,ఆర్డీఓ లు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి,అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తదుపరి జిల్లాల్లో అర్హులైన వికలాంగులకు బ్యాటరీ వెహికిల్స్,ల్యాప్ టాప్స్,వీల్ చైర్స్ అందజేశారు. వివిధ పాఠశాల విద్యార్థులు వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు,పాత్రికేయులకు మరియు విద్యార్ధినీ, విద్యార్ధులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు మరియు అభివoదనములు. దేశమంతటా ఆనందోత్సాహాలతో గణతంత్ర దినోత్సవాన్ని పండుగలా జరుపుకునే పర్వదినమిది. మన జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే మనందరి హృదయాలు ఆనందంతో పరవశిస్తాయి. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలుపుకునేందుకు,భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి సారధ్యంలో వ్రాయబడిన భారత రాజ్యాంగము జనవరి 26,1950 వ రోజున అమలులోకి వచ్చింది. ఇలాంటి పర్వదినాన దేశ స్వాతంత్ర్యము కోసము పోరాటము సాగించిన అమర వీరులకు,రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భముగా జోహారులు అర్పించుచున్నాను. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పధకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను అని అన్నారు. మహాలక్ష్మి పథకం: మన జిల్లాలో ఇప్పటివరకు RTC బస్సులలో 1 కోటి 97 లక్షల మహిళా ప్రయాణికులకు 102 కోట్ల 79 లక్షల రూపాయలతో ఉచిత ప్రయాణం కల్పించనైనది. మహాలక్ష్మి పధకం ద్వారా మహిళా సాధికారత మరియు వంట గ్యాస్ సిలిండర్లను తక్కువ ధరకు అందించాలని ఉద్దేశ్యంతో 500 రూపాయలకు LPG సబ్సిడీ సిలిండర్ ఇవ్వాలని సంకల్పించి, అందులో భాగంగా మన జిల్లాలో 1 లక్ష 27 వెల 981 మందిని మహాలక్ష్మి పధకం క్రింద అర్హులుగా గుర్తించి,5 లక్షల 56 వేల 172 సిలిండర్ల ను అందచేసి 17 కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తమును వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. గృహజ్యోతి పథకం: గృహజ్యోతి పథకంలో భాగంగా ఇప్పటివరకు 96 కోట్ల 96 లక్షల రూపాయల విలువ గల విద్యుత్ ను 1లక్ష 50 వేల 568 మంది వినియోగదారులకు మార్చ్ 2024 నుండి జీరో బిల్ ఇవ్వడం జరుగుచున్నది. వ్యవసాయ శాఖ : రైతు భరోసా: రైతుభరోసా పథకం క్రింద ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరoలో 2 లక్షల 33 వేల 418 మంది రైతులకు 306 కోట్ల 46 లక్షల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడము జరిగింది. రైతు ఋణ మాఫీ: రైతుల సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి,పంట ఋణ మాఫీ 2024 ప్రకారం మన జిల్లాలో పంట ఋణాలు తీసుకున్న 77 వేల 660 మంది రైతులకు 628 కోట్ల 72 లక్షల రూపాయలు ఋణ మాఫీ చేయడం జరిగింది. రైతు బీమా పథకం: “రైతు బీమా పథకం ద్వారా మన జిల్లాలో 2025-26 సంవత్సరములో మరణించిన 186 మంది రైతుల కుటుంబాలకు 9 కోట్ల 30 లక్షల రూపాయలు వారి నామిని ఖాతాలలో జమ చేయడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా జిల్లాలోఇప్పటివరకు 21 విడుతలలో పెట్టుబడి సహాయ నిమిత్తము మొత్తం 462 కోట్ల 64 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్హులైన రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగినది. ఉద్యానవన శాఖ: మన జిల్లాలో 25 వేల 203 ఎకరాలలో ఉద్యాన మరియు మల్బరీ పంటలు సాగులో ఉన్నవి.మన జిల్లాలో గత మూడేళ్ళలో 4 వేల 500 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును చేపట్టడం జరిగింది. పంట కోతకు వచ్చిన 165 ఎకరాల నుండి 56 మెట్రిక్ టన్నుల గెలలు కోసి మిల్లులకు పంపడం జరిగింది. ఈ సంవత్సరములో 3 వేల 500 ఎకరాల కొత్త తోటల పెంచుట లక్ష్యానికి గాను ఇప్పటివరకు 570 ఎకరాలలో మొక్కలు నాటడం పూర్తి అయినది. ఇందిరమ్మ ఇండ్లు: జిల్లాలోని 5 నియోజికవర్గాలలో 9 వేల 735 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగా,అవి అన్నీ పూర్తి అయ్యే దిశలో ఉన్నవి.ఇప్పటివరకు లబ్దిదారులకు ఇండ్లకు నిర్మాణ దశను బట్టి 195 కోట్ల 10 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశాం.ఈ విషయoలో రాష్ట్ర ప్రభుత్వo నుండి ప్రశంస అందుకోవడం జరిగింది. నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి: జిల్లాలో ప్యాకేజీ-15 యొక్క ముఖ్య ఉద్దేశ్యం జిల్లాలో 63 వేల 300 ఎకరములకు సాగు నీరు అందించుటకు ఉద్దేశించబడినవి. ఇప్పటివరకు ఈ ప్యాకేజీ-15 యొక్క పనులు 617 కోట్ల రూపాయల వ్యయంతో 79.88% పనులు పూర్తి అయినవి.ప్రధాన కాలువ లైనింగ్ తుది పనులు పురోగతిలో ఉన్నవి.ప్యాకేజీ-16 ప్రధాన కాలువ 36.169 km నుండి 94 km పొడవు మొత్తం 55.51 కి.మీ పనులు1059 కోట్ల 75 లక్షల రూపాయలతో ఒప్పందం చేయుట జరిగింది.ఈ ప్యాకేజీ ద్వారా మన జిల్లాలోని యం.తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, గుండాల,ఆలేర్, ఆత్మకూర్,వలిగొండ,చౌటుప్పల్ మరియు నారాయణపూర్ మండలాలకు సంభందిత డిస్ట్రిబ్యూటరీ చానల్స్ ద్వారా 1 లక్ష 65 వేల 500 ఎకరములకు సాగు నీరు అందించుటకు ప్రతిపాదించబడినవి. ఇప్పటివరకు ఈ ప్యాకేజీ పనులు 671 కోట్ల రూపాయలతో వ్యయంతో 60% పనులు పూర్తి అయినవి. గంధమల్ల జలాశయం: జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన గంధమల్ల జలాశయo నిర్మాణము కొరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసినారు. ఇట్టి జలాశయ నిర్మాణము 1.41 TMC ల నీటి సామర్థ్యంతో 358 కోట్ల 16 లక్షల రూపాయలతో ఒప్పందం చేయడం జరిగింది. ఇట్టి జలాశయo భూ సేకరణ పనులు పురోగతిలో ఉన్నవి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో 56 వేల ఎకరాల ఆయకట్టు మరియు 50 చెరువులను నింపడానికి వీలవుతుంది.ఇప్పటివరకు 27 కోట్ల 53 లక్షల రూపాయలు పరిహారము చెల్లింపుకు నిధులు మంజూరైనవి. భునియాదిగాని, పిల్లాయిపల్లి మరియు ధర్మారెడ్డి కాలువలు: భునియాదిగాని కాలువ నిర్మాణము పూర్తి చేయుటకు 195 కోట్ల రూపాయలతో ఒప్పందం జరిగింది. ఈ కాలువ ద్వారా 14 వేల 575 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధి లోకి వస్తుంది మరియు చెరువుల క్రింద 6 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.భూసేకరణ వివిధ దశలో ఉన్నది.పిల్లాయిపల్లి కాలువ నిర్మాణము పూర్తి చేయుటకు 58 కోట్ల 30 లక్షల రూపాయలతో ఒప్పందం జరిగింది.ఈ కాలువల యొక్క పనులు పురోగతిలో ఉన్నవి ఈ కాలువ ద్వారా 16 వేల 525 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధి లోకి వస్తుంది.మరియు సుమారు 84 చెరువుల క్రింద 6 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.ధర్మారెడ్డి కాలువ నిర్మాణము పూర్తి చేయుటకు 84 కోట్ల రూపాయలతో ఒప్పందం జరిగింది.ఈ కాలువల యొక్క పనులు పురోగతిలో ఉన్నవి ఈ కాలువ ద్వారా 12 వేల 661 ఎకరాల నూతన ఆయకట్టు అభివృద్ధి లోకి వస్తుంది మరియు 5 వేల 126 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 16 లక్షల 17 వేల పని దినాలు కల్పించి 71 కోట్ల 4 లక్షల రూపాయలు ఖర్చుచేయనైనది. చేయూత పథకం: మన జిల్లాలో వృద్దాప్య, వితంతు,వికలాoగుల,కల్లుగీత, చేనేత,ఒంటరి మహిళలు మరియు బీడి కార్మికులు మొత్తం 97వేల 666 మంది లబ్దిదారులకు నెలకు 24 కోట్ల 70 లక్షల రూపాయల పెన్షన్ ను పంపిణి చేయడము జరుగుచున్నది. స్వయం సహాయక సంఘాలు: ఈ ఆర్ధిక సంవత్సరములో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఋణాల పంపిణి కార్యక్రమం క్రింద 611 కోట్ల 17 లక్షల లక్ష్యం నిర్ణయిoచగా ఇప్పటివరకు 597 కోట్ల 44 లక్షల ఋణ సదుపాయం కల్పించనైనది.మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్త్రీ నిధి పధకం ద్వారా 475 స్వయం సహాయక సంఘాలకు13 కోట్ల 38 లక్షల రూపాయలు మంజూరి చేయడము జరిగింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా): జిల్లాలోని (6) మున్సిపాలిటీలలోని బ్యాంకు లింకేజి ద్వారా ఈ సంవత్సరoలో ఇప్పటి వరకు 845 స్వయం సహాయక సంఘాలకు 114 కోట్ల రూపాయలు మంజూరి చేయడము జరిగింది మరియు స్త్రీ నిధి పధకం ద్వారా 385 స్వయం సహాయక సంఘాలకు 24 కోట్ల 5 లక్షల రూపాయలు మంజూరి చేయడము జరిగింది. మహిళా సంఘాలకు వడ్డీ లేని ఋణాలు: ఈ ఆర్ధిక సంవత్సరములో మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఋణాల పంపిణి కార్యక్రమం క్రింద మన జిల్లాలో ఇప్పటి వరకు 7 కోట్ల 75 లక్షల రూపాయలు వడ్డీ లేని ఋణాల చెక్కుల పంపిణి చేయడము జరిగింది. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి: ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి పధకం ద్వారా 18 సంవత్సరాలు నిండి రేషన్ కార్డు కలిగిన అందరు మహిళలకు చీరల పంపిణి కార్యక్రమము జరుగుచున్నది.ఇందులో భాగంగా మన జిల్లాలో 2 లక్షల 3 వేల 394 చీరలు పంపిణి చేయడం జరుగుతుంది. పౌర సరఫరాల శాఖ: నిరుపేదలకు సన్నబియ్యం:. జిల్లాలో ప్రతి నెల 515 రేషన్ షాపుల ద్వారా అర్హత కలిగిన 2 లక్షల 48 వేల 757 కుటుంబాలకు 4 వేల 961 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణి చేయడం జరుగుచున్నది. నూతన రేషన్ కార్డుల మంజూరు: జిల్లాలో నూతన రేషన్ కార్డుల మంజూరి ప్రక్రియ జరుగుచుoడగా,జనవరి 2025 నుండి నేటివరకు 34 వేల 39 నూతన కార్డులు మంజూరి చేయగా,1 లక్షా 80 వేల 94 యూనిట్లు చేర్పులు చేయడo జరిగింది మరియు రేషన్ పంపిణి చేయటం జరుగుతుంది. జిల్లాలో 2025-26 ఖరిఫ్ సాగుకు సంబంధించి 330 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 19 వేల 426 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించి వారికీ 758 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో జమచేయడం జరిగింది.కాగా,సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 రూపాయలు బోనస్ గా చెల్లించుచుoడగా,రబీ 2024-25 పంటకాలంలో 11 వేల 508 మెట్రిక్ టన్నుల, సన్నధాన్యం సేకరించటం జరిగింది. జిల్లా పంచాయితీ శాఖ: తెలంగాణ ప్రభుత్వము నిర్వహించిన 2వ సాధారణ ఎన్నికలలో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రoలోనే అగ్రగామిగా నిలిచింది.జిల్లా నందు 427 సర్పంచ్, ఉప సర్పంచ్ సభ్యులు మరియు 3 వేల 704 వార్డు సభ్యులు ఎన్నికైనారు. 2025-26 వరకు గ్రామపంచాయితీల పన్నుల డిమాండ్ 17 కొట్ల 26 లక్షల రూపాయలు మొత్తం కలెక్షన్ అయిన పన్నులు 8 కోట్ల 7లక్షల 38 వేల రూపాయలు వసూలు చేయబడినవి. సంక్షేమ వసతి గృహాలు: ప్రభుత్వ వసతి గృహాలలో నివశిస్తున్న బాల బాలికలకు డైట్ ఛార్జీలు 40% మరియు కాస్మోటిక్ ఛార్జీలు 200% పెంచడం జరిగింది. జిల్లాలో 95 ప్రభుత్వ వసతి గృహాలలో జిల్లా స్థాయి అధికారులు దత్తత తీసుకోని ప్రతి నెల వసతి గృహాలలో వినూత్నముగా నిద్ర చేయడం మరియు వసతి గృహాలలో సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుంది.ప్రతి ప్రభుత్వ వసతి గృహాలకు కామన్ మెనూ విధానమును పాటించడం జరుగుతుంది. షెడ్యూల్డు కులముల అభివృద్ధి: జిల్లాలోని 18 వసతి గృహములలో 1 వేయి 124 మంది విద్యార్థులకు,అలాగే 2 కళాశాల వసతి గృహాలలో 256 మందికి ప్రవేశం కల్పించడం జరిగినది.పోస్టు మెట్రిక్ మరియు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనముల ద్వారా 2025-26 సంవత్సరoలో 3 వేల 169 మంది విద్యార్థినీ, విద్యార్థులకు 3 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరి చేయనైనది.బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా 2025-26 సంవత్సరoలో ప్రవేశాల కొరకు 68 లక్ష 92 వేల రూపాయలు 103 మంది విద్యార్థులకు ఖర్చు చేయడం జరిగింది. గిరిజన సంక్షేమము : జిల్లాలో 8 గిరిజన వసతి గృహాలలో 694 మంది విద్యార్ధులు వసతి పొందుతున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ క్రింద 1 వేయి 292 విద్యార్ధినీ విద్యార్ధులకు 1 కోటి 93 లక్షల 94 వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయడము జరిగినది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి క్రింద నలుగురు గిరిజన విద్యార్దులకు 80 లక్షల రూపాయలు మంజూరీ చేయనైనది. వెనుకబడిన తరగతుల అభివృద్ధి: జిల్లాలో ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ 18 వసతి గృహములలో 1 వేయి 93 మంది విద్యార్థులకు వసతి కల్పిoచుచున్నాము.2025-26 సంవత్సరoలో వసతి గృహల నిర్వహణకు 1కోటి 2లక్షల 67 వేల రూపాయల నిధులు ఖర్చు చేయడం జరిగినది. కళాశాల విద్యార్ధులకు ఉపకారవేతనము క్రింద 2025-26 సంవత్సరమునకు 18 కోట్ల 54 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాగా 3 వేల 623 మంది విద్యార్ధులకు 1కోటి 88 లక్షల రూపాయలు నిధులు ఖర్చు చేయడం జరిగినది. విదేశాలలో ఉన్నత విద్య చదువుకొనుటకు ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు మహాత్మ జ్యోతిభాపూలే బి.సి ఓవర్సీస్ విద్యా నిధి పధకం ద్వారా 20 లక్షల రూపాయల అందచేయడం జరుగుతుంది. మైనారిటీల సంక్షేమ శాఖ: జిల్లాలో 03 మైనారిటీ గురుకుల మరియు జూనియర్ కళాశాలలో 1070 మంది విద్యార్థులకు విద్యాబోధన జరుగుచున్నది.ఈ సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ ద్వారా 960 మంది మైనారిటీ విద్యార్థులకు 3 కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరు చేయడము జరిగినది.మన జిల్లాలో క్రిస్మస్ పండుగ 2025 సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా 4 లక్షల రూపాయలతో పేద క్రైస్తవ కుటుంబాలకు విందు ఏర్పాటు చేయడము జరిగినది. మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ: జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా 4 ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్ వాడీ కేంద్రాలు పనిచేయుచున్నవి. ఆరోగ్య లక్ష్మి పధకం ద్వారా 3 వేల 188 మంది బాలింతలకు, 4 వేల 842 మంది గర్భవతులకు మరియు 20 వేల 825 మందికి 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పోషక ఆహారం అందిస్తున్నాము. వికలాoగులకు ఎకనామికల్ రిహబిటేషన్ అవార్డు 17 మందికి మంజూరి చేయనున్నాము. విద్యా శాఖ: శ్రీమతి సావిత్రిభాయిపూలే జయంతి తేది జనవరి 3, 2026 సందర్భంగా జిల్లాలోని మొదటిసారిగా 17 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయుల యొక్క సేవలు గుర్తించి సత్కరించడం జరిగినది. జిల్లాలో 10 వ తరగతి చదువుచున్న విద్యార్థులకు సబ్జెక్టు వారీగా అభ్యాస దీపికలు అందచేయుట,ఉదయం మరియు సాయంత్రం అదనంగా ఒక గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహించడం, మోడల్ పరీక్షలు పెట్టి వెనకబడిన విద్యార్థులను గుర్తించడం జరిగినది.1200 మంది చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, గ్రామoలోని విద్యావంతులైన వారితో ఇట్టి విద్యార్థులను జతపరిచి,ప్రతి విద్యార్ధి ఉత్తీర్ణత సాధించే విధంగా వారికి ప్రత్యేక సూచనలు ఇవ్వడం ఈ విద్యాసంవత్సరము నుండి ప్రారంభించడం జరిగింది ఇంటర్మీడియట్ విద్య: జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు,14 సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలు,2 మైనారిటీ జూనియర్ కళాశాలలు,9 మహాత్మా జ్యోతిరావుపులే కళాశాలలు,8 KGBV, 7 ఆదర్శ కళాశాలలు మరియు 20 ప్రైవేటు కళాశాలలు ఉన్నవి. ఈ విద్యా సంవత్సరము ఫిబ్రవరి ఒకటవ తేది నుండి ప్రయోగ పరీక్షలు మరియు ఫిబ్రవరి 25 నుండి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి.ఉత్తమ ఫలితాల సాధనకై నిత్యం సమీక్షలు నిర్వహించడం జరిగింది. వైద్య మరియు ఆరోగ్య శాఖ: ఆరోగ్య మహిళా క్లినిక్స్ ద్వారా 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు 2025 సంవత్సరoలో 21 వేల 348 మందికి సేవలు అందించబడినవి. పాఠశాల ఆరోగ్య కార్యక్రమము ద్వార హాస్టల్ విద్యార్ధులకు ప్రతి నెల మెడికల్ క్యాంపులు నిర్వహించి అవసరమైన వారికి చికిత్సలు నిర్వహించి,మందులు ఇవ్వడం మరియు అవసరమైన వారికీ రక్త పరీక్షలు చేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పధకం: “రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం” ద్వారా బీ.పి.ఎల్ కుటుంబాలకు మెరుగైన కార్పొరేట్ ఆరోగ్య బీమా సహాయాన్ని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెoచడం జరిగింది. ఈ పథకంలో 1వేయి 672 వ్యాధులకు ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారా చికిత్సలు మరియు శస్త్ర చికిత్సలు అందచేయడం జరుగుతుంది. మన జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో 15వేల105 మందికి శస్త్ర చికిత్సలకు 45 కోట్ల 90 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. గ్రామీణ నీటి సరఫరా శాఖ: త్రాగు నీటి ఎద్దడి నివారణ కొరకు జిల్లాలో అన్ని నియోజకవర్గల శాసనసభ్యులు తమ ప్రత్యేక నిధుల(SDF) నుండి 3 కోట్ల 29 లక్షల రూపాయల నిధులు మరియు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్(DMFT) నుండి 1కోటి 41 లక్షల రూపాయల నిధులు కేటాయించారు. అటవీ శాఖ: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 20 లక్షల 53 వేల మొక్కలు నాటుట లక్ష్యము కాగా 20 లక్షల 71 వేల మొక్కలు వివిధ శాఖల ద్వారా జిల్లా వ్యాప్తoగా నాటడమైనది మరియు 53 అటవీ బ్లాకులు ఉండగా ఇందులో 16 అటవీ బ్లాకులు ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్బన్ లoగ్ స్పేస్ అభివృద్ధి చేసి ప్రజల సందర్శనార్ధం ప్రారంబించుట జరిగినది. పశుసంవర్ధక శాఖ: ఈ ఆర్ధిక సంవత్సరములో కేంద్ర ప్రభుత్వ మినీ కిట్ పధకం ద్వారా 75 % సబ్సిడీ పై 4 లక్షల 98 వేల రూపాయలతో 6.75 టన్నుల పశుగ్రాస విత్తనములు రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఆలేర్ మరియు భువనగిరి నియోజకవర్గ పరిధిలో రెండు సంచార పశు వైద్య శాలలు 1962 టోల్ ఫ్రీ నెంబర్ తో నిరంతరంగా రైతులకు ఇంటి ముంగిట సేవలు అందిస్తున్నాయి. మత్స్య శాఖ: జిల్లానందు 161 పెద్ద చెరువులు 469 చిన్న చెరువులు మరియు మూసి నది పరివాహక ప్రాంతంలో 20 చెరువులు కలవు. జిల్లాలో 178 మత్స్య పారిశ్రామిక సంఘాలు మరియు 12 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల ద్వారా సుమారు 11 వేల 654 మత్స్యకారులు ఉన్నారు.2025-26 సంవత్సరములో మత్స్య శాఖ ద్వారా 2 కోట్ల 80 లక్షల చేపపిల్లలను 630 చెరువులలో వదలడం జరిగిoది. చేనేత మరియు జౌళి శాఖ: తెలంగాణ ప్రభుత్వo 2025-26 మరియు 2026-27 సంవత్సరములలో చేనేత మరియు అనుబంధ కార్మికుల కోసం ‘’ నేతన్నకు పొదుపు” పథకాన్ని ఏప్రిల్ 2025 నుండి అమలు చేసింది. ఈ పధకం ద్వారా 10 వేల 790 మంది చేనేత మరియు అనుబంధ కార్మికులు నమోదు చేసుకోగా 4 కోట్ల 34 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది. నేతన్నకు భీమా పథకములో ఆర్హులైన 10 వేల 686 మంది చేనేత కార్మికులను చేర్చడం జరిగింది. వివిధ కారణాలతో మరణించిన 159 మంది నేత కార్మిక కుటుంబాలకు 7 కోట్ల 95 లక్షల రూపాయలు నామినీలకు ఖాతాలలో జమ చేయడము జరిగింది. పరిశ్రమలు: TS-iPASS ద్వారా జిల్లా అవతరణ నుండి ఇప్పటివరకు 7 వేల 808 కోట్ల రూపాయల పెట్టుబడితో 1 వేయి 254 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడమైనది. ఈ పరిశ్రమ ద్వారా 44 వేల 641 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది.టి- ప్రైడ్ పధకం ద్వారా జిల్లా అవతరణ నుండి ఇప్పటివరకు 990 మంది షెడ్యూల్డ్ కులముల, షెడ్యూల్డ్ తెగల మరియు దివ్యాంగులకు 26 కోట్ల 53 లక్షల రూపాయలు సబ్సిడీ మంజూరి చేయనైనది.PMEGP పధకం ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరములో 178 దరఖాస్తులకు 6 కోట్ల 88 లక్షల రూపాయలు బ్యాంకుల ద్వారా మంజూరి చేయడం జరిగింది. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ: 2024-25 సంవత్సరములో CRR నిధులతో 20 రోడ్ల నిర్మాణ పనులు మంజూరై ఒక పని పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతి లో ఉన్నవి మరియు MGNREGS ద్వారా 67 అంగన్వాడి భవన నిర్మాణ పనులు 5 కోట్ల 36 లక్షల రూపాయలతో మంజూరై, పనులు పురోగతి లో ఉన్నవి. రోడ్లు మరియు భవనాలు: రాష్ట్ర ప్రణాళిక నిధుల క్రింద 9 రోడ్లు పనులు మరియు 4 వంతెనలు 544 కోట్ల 18 లక్షల రూపాయలతో 122.70 కి.మీ మంజూరై 93.40 కి.మీ పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవి.నాన్ ప్లాన్ నిధుల క్రింద 68 పనులు (317.278 కిలోమీటర్) 199 కోట్ల 68 లక్షల రూపాయలతో మంజూరై, 242.34 కి.మీ పనులు పూర్తి కాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవి మరియు రైల్వే సేఫ్టీ క్రింద ఆలేర్ లో రోడ్ అండర్ బ్రిడ్జి 11 కోట్ల రూపాయల తో మంజురై,పని జరుగుచున్నది. ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ:- తెలంగాణాకు వన మహోత్సవం కార్యక్రమoలో భాగంగా 2025 సంవత్సరoకు గాను జిల్లా యందు 54 వేల 500 ఈత / ఖర్జూర మొక్కలు నాటడం జరిగింది.జిల్లాలో గీత కార్మికుల సంక్షేమ కార్యక్రమములో భాగంగా 2025-26 సంవత్సరములో 5 మంది మరణించిన గీత కార్మికులకి, (04) మందికి శాశ్వత వికలాoగులకు మరియు (24) మందికి తాత్కాలిక వికలాoగులకు గాను 52 లక్షల 40 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందజేయడం జరిగినది. పోలీస్ శాఖ : జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ మన రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.నేరాల నియంత్రణకై జిల్లాలో అన్ని గ్రామాలలో,పట్టాణాలలో ముఖ్యమైన కూడళ్ళలో 17 వేల 178 సి.సి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిoది.జిల్లాలో సాంఘిక దురాచారాలపై అన్నీ ముఖ్యమైన ప్రాంతాలలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ ప్రజలలో సరియైన అవగాహన కల్పిస్తున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకెళ్ళి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికి అందేటట్లు చేయడానికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు,అధికారులు, అనధికారులు,పాత్రికేయులు, బ్యాంకర్లకు మరియు శాంతి భద్రతలు పరిరక్షిస్తున్న పోలీస్ అధికారులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు మరియు విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు తెలియచేస్తూ ఇదే స్పూర్తితో అందరము కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదాo.ఆ దిశలో మనమoదరం అంకితమై శ్రమిస్తూ. తెలంగాణ రాష్ట్రం లో యాదాద్రి భువనగిరి జిల్లా ను అగ్రగామి గా నిలుపుదాం అని తెలియజేశారు.  Follow us on Website Facebook Instagram YouTube