BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 April 2026, 11:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Apr, 2026 - 11:05 AM
163 వీక్షణలు

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) కే. నాగ ప్రభు కుమార్ మరియు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఎ. అవులయ్య ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “నవోదయం 2.0” కార్యక్రమం భాగంగా నాటు సారా నిర్మూలనపై ప్రత్యేక చర్యలు చేపట్టబడ్డాయి. ఈ క్రమంలో, గతంలో నాటు సారా తయారీ మరియు విక్రయాలలో పాల్గొని, నేర స్థలంనుండి పరారైన నాలుగు (4) మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకొని, రిమాండ్ నిమిత్తం తిరువూరు జేఎఫ్‌సిఏం కోర్టుకు తరలించినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ. మస్తానయ్య తెలిపారు. అదుపులోకి తీసుకున్న ముద్దాయిల వివరాలు: బానావతు బాలు – తండ్రి: పేరయ్య, నివాసం: పోతనపల్లి చిన్న తండ, ధరావతు శ్రీరాములు – తండ్రి: చిన్నయ్య, నివాసం: పోతనపల్లి చిన్న తండ, హసవతు సాయి కుమార్ – తండ్రి: రాము, నివాసం: పోతనపల్లి పెద్ద తండ, బెజవాడ శ్రీనివాసరావు – తండ్రి: చంద్రయ్య, నివాసం: జనార్దనవరం. ప్రస్తుతం, నూజివీడు స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాలలో బెల్ట్ షాపులు నిర్వహించే వారు, నాటు సారా తయారు చేసే వారు, విక్రయించే వారు మరియు నిల్వ ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా, నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు మరియు బెల్లపు ఊట్లు కలిగి ఉన్న భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. సహకారం కోరారు: నాటు సారా కార్యకలాపాలపై ఎవరైనా సమాచారం అందిస్తే, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారి మొబైల్ నంబర్ 9440902462కు తెలియజేయవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఈ సందర్భంగా తెలిపారు.