BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 July 2026, 06:24 pm
Posted by : కూనురు మధు

​నత్తనడకన చిట్యాల ఫ్లైఓవర్ పనులు అస్తవ్యస్తంగా చిట్యాల హైవే : రోడ్డెక్కిన ప్రతిపక్షం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
17 Jul, 2026 - 06:24 PM
302 వీక్షణలు

​నత్తనడకన చిట్యాల ఫ్లైఓవర్ పనులు అస్తవ్యస్తంగా చిట్యాల హైవే : రోడ్డెక్కిన ప్రతిపక్షం

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలోని జాతీయ రహదారిపై చిట్యాల వద్ద  నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేసి, వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం  బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ​ఈ సందర్భంగా పార్టీ నాయకులు  మాట్లాడుతూ 2024 జూలైలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు.  ఆరు నెలల్లోనే పనులన్నీ పూర్తి చేస్తామని అప్పట్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రకటించినప్పటికీ గత రెండు సంవత్సరాల గడుస్తున్నా నేటికీ పనులు పూర్తి కాలేదని వారు తీవ్రంగా ఆరోపించారు. ​ ​ప్రస్తుతం నిర్మాణ పనులు  జరుగుతున్న ఆ పనులలో తీవ్ర ఆలస్యం వల్ల చిట్యాల పట్టణంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని టిఆర్ఎస్  నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్ల దుస్థితి, ట్రాఫిక్ సమస్యల కారణంగా స్థానిక వ్యాపారులు, ప్రజలు   నిత్యం నరకం చూస్తున్నారని, రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయాలపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.


ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పట్టణ ప్రజల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. ​ఈ  కార్యక్రమంలో చిట్యాల సింగల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మనగొట్టి శ్రీనివాసు, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్ పాల్గొన్నారు.

​వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, బొబ్బల శివశంకర్ రెడ్డి, జిట్టా బొందయ్య, కందాటి రమేష్ రెడ్డి, ఆగు అశోక్ యాదవ్, కన్నెబోయిన శ్రీశైలం, రుద్రవరం యాదయ్య, మారగోని రమేష్, నాళావతి కృష్ణ, ఆవుల ఆనంద్, జిట్ట శేఖర్, సాయిరెడ్డి ప్రతాపరెడ్డి, పోకల రాములు, కునూర్ శంకర్, పాల కిష్టయ్య, రామగిరి జనార్దన్ రావు, రుద్రారపు కృష్ణ, బాలు, మాసపెల్లి వెంకన్న, తోటకూరి అనిల్, రాగుల శివ, ఎండీ ముజ్జు, పోలాస్ కన్యాచారి, చింతపల్లి ప్రవీణ్, ఐలాపూర్ నరేష్, బొడ్డుపల్లి శ్రీను, బొడ్డుపల్లి ఉపేందర్, సిలువేరు రిశ్వంత్, గూడ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.