BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 July 2026, 06:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హెల్మెట్ ధారణపై చింతలపూడిలో అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 06:23 PM
117 వీక్షణలు

హెల్మెట్ ధారణపై చింతలపూడిలో అవగాహన కార్యక్రమం

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను కూడా కాపాడుకోవచ్చని సూచించారు.

అనంతరం రోడ్డు భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే ఉద్దేశంతో హెల్మెట్ ధరించి ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా హెల్మెట్ ధరించి పట్టణ ప్రధాన రహదారుల మీదుగా తన క్యాంపు కార్యాలయం వరకు ప్రయాణిస్తూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సందేశం ఇచ్చారు. ప్రజా ప్రతినిధి స్వయంగా ఆచరించి చూపడంతో పలువురు అభినందించారు.

కార్యక్రమంలో సీఐ క్రాంతి కుమార్, ఎస్‌ఐ సతీష్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎర్రగుంటపల్లి గ్రామ నాయకులు, హెల్మెట్ దాతలుగా సహకరించిన మాజీ జడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, శాంతారెడ్డి పాల్గొన్నారు.