BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 16 July 2026, 08:23 pm
Posted by : కూనురు మధు

ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థుల మహాధర్నా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
16 Jul, 2026 - 08:23 PM
74 వీక్షణలు

ఫీజు బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థుల మహాధర్నా

యాదాద్రి భువనగిరి జిల్లా ​రామన్నపేట 

విద్యార్థులకు రావాల్సిన రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట సుభాష్ సెంటర్‌లో  విద్యార్థులతో మహాధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరగగా, అనంతరం ధర్నా శాంతియుతంగా ముగిసింది. ​బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు జరిగిన ఈ ఆందోళనలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, వివిధ పార్టీల అఖిలపక్ష నాయకులు ఈ ధర్నాకు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ​జీవో నెంబర్ 9 రద్దు: పేద విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 9, ఆర్ఆర్ యాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలి డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివే విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలి. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులను అందించాలి అని కోరారు.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి, మెస్ ఛార్జీలను పెంచాలి అని. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి అని అన్నారు. మూసి సుందరీకరణ, ఫోర్త్ సిటీల కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం... పేద విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను ఎందుకు నిలిపివేసిందని నేతలు ప్రశ్నించారు. ​సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఎంపీ ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు అక్కెనపల్లి సైదులు, బీజేపీ ప్రతినిధి పల్లపు దుర్గయ్య, బీఆర్‌ఎస్ నాయకులు సురేష్, మహేష్, ఎడ్ల మహాలింగం తదితరులు పాల్గొన్నారు.