BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 July 2026, 07:12 pm
Posted by : కూనురు మధు

విద్యార్థి దశ నుంచే నీటి సంరక్షణ అలవర్చుకోవాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
16 Jul, 2026 - 07:12 PM
241 వీక్షణలు
విద్యార్థి దశ నుంచే నీటి సంరక్షణ అలవర్చుకోవాలి 

విద్యార్థి దశ నుండి నీటి సంరక్షణ సంబంధించిన అలవాట్లను అలవర్చుకోవాలని చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీతా రమేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పురపాలక పరిపాలన కమిషనర్ మరియు డైరెక్టర్  ఆదేశాల మేరకు, చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక గ్రీన్ గ్రోవ్ స్కూల్‌లో "క్యాచ్ ది రైన్" (వాన నీటిని పట్టుకుందాం) పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.  ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, మున్సిపల్ కమిషనర్ గురులింగం, వైస్ ఛైర్పర్సన్ గుండెబోయిన లక్ష్మీ సైదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ప్రతి బొట్టు వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం మన అందరి బాధ్యత అని అన్నారు. విద్యార్థి దశ నుంచే నీటి సంరక్షణపై అవగాహన పెంచుకోవాలని, పాఠశాలల్లోనూ, ఇళ్లలోనూ వాన నీటిని వృథా కాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. విద్యార్థులు తమ ఇళ్ల వద్ద వర్షపు నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని కోరారు. ​ వర్షం పడినప్పుడు ఆ నీరు డ్రైనేజీల్లో కలవకుండా, చెట్లు లేదా ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా చూడాలి అని సూచించారు. ప్రతి విద్యార్థి బ్రష్ చేసేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు ట్యాప్‌లను అనవసరంగా తెరిచి ఉంచకూడదు  తెలిపారు . కూరగాయలు, బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా మొక్కలకు పోయడం అలవాటు తీసుకోవాలని తెలిపారు ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బొబ్బలి సందీపారామ్ రెడ్డి, ఏర్పుల పరమేష్, దేశపాక లతా రాజేష్,  కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, గ్రీన్ గ్రోవ్ పాఠశాల ఏవో పోల  గోవర్ధన్ , విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు