BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 July 2026, 07:00 pm
Posted by : కూనురు మధు

పేద కుటుంబాల ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
16 Jul, 2026 - 07:00 PM
155 వీక్షణలు

పేద కుటుంబాల ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే వేముల వీరేశం

పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్‌పల్లి  మండలానికి చెందిన 102 మంది లబ్ధిదారులకు  గురువారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై  పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ​నకిరేకల్ నియోజకవర్గంలో రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, స్థానిక సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ​ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు సకాలంలో అందించి ఆదుకున్నందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.