BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 16 July 2026, 08:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి మండల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.3.50 లక్షల విలువైన నోటుబుక్స్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jul, 2026 - 08:24 PM
157 వీక్షణలు

చాట్రాయి మండల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.3.50 లక్షల విలువైన నోటుబుక్స్ పంపిణీ

రేపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చాట్రాయిలో కార్యక్రమం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 1,269 మంది విద్యార్థులకు సుమారు రూ.3.50 లక్షల విలువైన 6,346 నోటుబుక్స్ పంపిణీ చేయనున్నారు.

గత నెల 20వ తేదీన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సి.గుడిపాడులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో చాట్రాయి ఎంఈవో-2 వి.ఎస్.వి. బ్రహ్మాచారి చేసిన విజ్ఞప్తికి స్పందించిన రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ గవర్నర్ పంగులూరి కళ్యాణ్ మరియు బిజిర్ మైన్స్ డైరెక్టర్ బాలకోటిరెడ్డి ఈ నోటుబుక్స్‌ను అందించేందుకు ముందుకొచ్చారు. వారి ఆమోదంతో నోటుబుక్స్ ఇప్పటికే ఎంఆర్సీ చాట్రాయికి చేరుకున్నాయి.

ఈ నోటుబుక్స్ పంపిణీ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చాట్రాయిలో నిర్వహించనున్నట్లు ఎంఈవో-2 వి.ఎస్.వి. బ్రహ్మాచారి తెలిపారు. ఈ కార్యక్రమానికి పాత్రికేయులు హాజరై విజయవంతం చేయాలని ఆయన ఆహ్వానించారు.

కాగా, ఇదే దాతలు గతంలో కూడా బ్రహ్మాచారి విజ్ఞప్తి మేరకు చాట్రాయి ఎంఆర్సీకి సౌండ్ సిస్టమ్‌ను బహుమతిగా అందించి విద్యారంగానికి తమ వంతు సహకారం అందించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా వేలాది మంది చిన్నారులకు అవసరమైన నోటుబుక్స్ అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూతనందిస్తున్నారు.