నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘానికి కొత్త సారథి తల్లాడ శ్రీనివాస రావు, చాట్రాయి గౌడ సంఘం పగ్గాలు బూబత్తుల చెన్నారావుకు
నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘానికి కొత్త సారథి తల్లాడ శ్రీనివాస రావు, చాట్రాయి గౌడ సంఘం పగ్గాలు బూబత్తుల చెన్నారావుకు
చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ
పర్వతాపురం ఆత్మీయ సమావేశంలో ఏకగ్రీవ ఎన్నికలు.. నూతన నాయకత్వానికి ఘన సన్మానం, ప్రమాణ స్వీకారం
చాట్రాయి, జూలై 16: గౌడ సామాజిక వర్గ ఐక్యత, సంక్షేమం, హక్కుల సాధనే లక్ష్యంగా నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో జరిగిన ఆత్మీయ సమావేశం ఉత్సాహభరితంగా సాగగా, పెద్ద ఎత్తున గౌడ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని నూతన నాయకత్వానికి మద్దతు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం (రిజి. నెం. 222/2019) వ్యవస్థాపక అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు పోసిన చెంచు రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరీదు శివరామకృష్ణ సమక్షంలో జరిగిన సమావేశంలో నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షుడిగా తల్లాడ శ్రీనివాసరావు, చాట్రాయి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగాబూబత్తుల చెన్నారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అదే విధంగా చాట్రాయి మండల గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా పలగాని లక్ష్మీనారాయణ, చింతగుంట్ల చిన్న రంగయ్య, కార్యదర్శులుగా చింతా శ్రీనివాసరావు, కంటే అప్పారావు, గౌరవ అధ్యక్షుడిగా మాజీ వైస్ ఎంపీపీ పరసా వెంకటేశ్వరరావును ఎన్నుకున్నారు.
ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన నాయకులకు నియామక పత్రాలు అందజేసి ఘనంగా ప్రమాణ స్వీకారం చేయించారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. గౌడ సంఘాన్ని గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మరింత బలోపేతం చేసి, సామాజిక అభివృద్ధి, యువతకు ప్రోత్సాహం, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. నూతన నాయకత్వంపై సభ్యులు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ సంఘ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కోనకళ్ల రెడ్డమ్మ, వీరంకి రామచంద్రరావు, మాధు శివయ్య, మట్ట రామాశంకర్, కొండేటి కొండ, కృష్ణ జిల్లా అధ్యక్షుడు ఉయ్యూరు మురళి, ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, రాష్ట్ర యువత అధ్యక్షుడు చింతా అనిల్, చింతగుంట్ల వెంకటేశ్వరరావు, మిద్దె శివాజీ, బొర్రా నాగేశ్వరరావు, మడుపల్లి సత్యనారాయణ, మల్లవల్లి రాధాకృష్ణ, యువ నాయకులు సాయికృష్ణ, సాయి గౌడ్ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశం గౌడ సంఘం ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.