BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 16 July 2026, 09:10 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రతి సంక్షేమ పథకం గిరిజనులందరికి వంద శాతం చేరాలి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 Jul, 2026 - 09:10 AM
88 వీక్షణలు

ప్రతి సంక్షేమ పథకం గిరిజనులందరికి వంద శాతం చేరాలి - రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప..

అన్నమయ్య జిల్లా,పుంగనూరు, జూలై  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి వందశాతం చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప ఆదేశించారు. మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన గిరిజన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. గిరిజనులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించా రూ గ్రామంలో హౌసింగ్, తాగునీరు, ఆరోగ్యం, అంగన్వాడీ, విద్య, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిశీలించారు. గ్రామంలో కొన్ని గిరిజన కుటుంబాలకు ఇప్పటికీ ఆధార్ కార్డులు లేకపోవడం, శ్మశానవాటిక సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలను గ్రామస్థులు కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని అత్యవసరంగా పరిష్కరించి అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని అనంతరం పుంగనూరు మండలం కుమ్మరగుంట ఎస్టీ కాలనీలో మండల స్థాయి అధికారులతో సమావేశమై గిరిజనుల సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. పుంగనూరులోని జడ్పీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన సమావేశంలో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, వాటిని సకాలంలో పరిష్కరించాలని డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులు అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి తేజస్విని, పుంగనూరు తహసీల్దార్ రాము, సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు, మేడా రామకృష్ణ, మునికృష్ణ, బి.కోట బాలు, ఎస్టీ ట్రైబల్ నేషనల్ ప్రెసిడెంట్ అక్కులప్ప నాయక్, గిరిజన సంఘాల నాయకులు సాకే వీరాంజనేయులు, శ్రీనివాస్ వర్మ, కుప్పం జగన్, ఎం.బాబు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.