BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 16 July 2026, 11:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో పద్మశ్రీ గ్రహీత జ్ఞానానందకవి 104వ జయంతి వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jul, 2026 - 11:18 AM
168 వీక్షణలు

పెనుగొలనులో పద్మశ్రీ గ్రహీత జ్ఞానానందకవి 104వ జయంతి వేడుకలు ఘనంగా

జూలై 16: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ కవి, రచయిత ఎస్.టి. జ్ఞానానందకవి 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం నిర్వహించిన సభలో సాయిబాబా సేవా కమిటీ కన్వీనర్ రంగు సత్యనారాయణ మాట్లాడుతూ జ్ఞానానందకవి 1922 జూలై 22న విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో జన్మించారని తెలిపారు. ఆయన రచించిన 'హరిజనులు అంటరానివారా', 'అక్షర రాక్షసులు', 'వెలుగు బాట' వంటి రచనలు సమాజంలోని అసమానతలపై పోరాటానికి స్ఫూర్తినిచ్చే సాహిత్యంగా నిలిచాయని పేర్కొన్నారు.

ఉపాధ్యాయురాలు కె. లింగమ్మ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి జ్ఞానానందకవి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కవితా విశారద, కవి కోకిల, సాహితీ వల్లభ, మహాకవి, కళా ప్రపూర్ణ, కవితా శ్రీనాథ, కవి సార్వభౌమ వంటి బిరుదులతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారని వివరించారు. నేటి యువత ఆయన రచనలను చదివి సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమం అనంతరం విద్యార్థులు, చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞకృష్ణ, మహిళా సభ్యురాలు దేవర అంజలి, విద్యార్థులు, అంగన్వాడీ చిన్నారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.