BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 July 2026, 10:44 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో బీజేపీలోకి భారీ చేరికలు.. డాక్టర్ చిన్నం రామకోటయ్యకు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jul, 2026 - 10:44 AM
262 వీక్షణలు

నూజివీడు: నూజివీడు నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ చిన్నం రామకోటయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రామకోటయ్య తిరిగి బీజేపీలో చేరడం నూజివీడు నియోజకవర్గానికి, ముఖ్యంగా చాట్రాయి మండల పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు.

రామకోటయ్య నాయకత్వంలో నూజివీడు అసెంబ్లీ పరిధిలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ బీజేపీని ప్రజల్లో మరింత బలంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

త్వరలోనే చాట్రాయి మండల కేంద్రంలో డాక్టర్ చిన్నం రామకోటయ్య సమక్షంలో భారీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారని, నూజివీడు నియోజకవర్గంలో పార్టీ విస్తరణకు ఇది కీలక వేదిక కానుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.