BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 16 July 2026, 07:49 pm
Posted by : V శ్రీనివాస్

​మంచిర్యాల జిల్లాలో హెచ్.ఐ.వి స్క్రీనింగ్ పటిష్టం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Jul, 2026 - 07:49 PM
165 వీక్షణలు

​మంచిర్యాల జిల్లాలో హెచ్.ఐ.వి స్క్రీనింగ్ పటిష్టం: అంతర్జాతీయ '95-95-99' లక్ష్యాల సాధనే ధ్యేయం

​జిల్లాలో 2,064 మందికి ఉచిత ఏఆర్టీ చికిత్స: సమీక్షా సమావేశంలో డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్

​మంచిర్యాల, జూలై 16: మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (ఐ.డి.ఓ.సి) లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డి.ఎమ్.హెచ్.ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ గారి అధ్యక్షతన 'దిశా' (DISHA) మాస నివేదిక సమీక్షా సమావేశం నిర్వహించబడింది. మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష (MAS) లక్ష్యాలను సమీక్షించడం, హెచ్.ఐ.వి బాధితులకు (PLHIV) మెరుగైన వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా ఈ సమావేశం సాగింది. ప్రస్తుతం జిల్లాలో 2,064 మంది హెచ్.ఐ.వి బాధితులకు ఉచిత యాంటీ-రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందిస్తున్నామని, ఇందులో 98 శాతం మంది రోగులకు వైరల్ లోడ్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు డి.ఎమ్.హెచ్.ఓ వెల్లడించారు.

​అంతర్జాతీయ "మొదటి 95" లక్ష్యాన్ని చేరుకోవడానికి, జిల్లాలో ఇంకా నిర్ధారణ కాని మరో 436 కొత్త హెచ్.ఐ.వి కేసులను గుర్తించాల్సిన అవసరం ఉందని డాక్టర్ నరేందర్ రాథోడ్ పేర్కొన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది, వైద్య బృందాలు సమన్వయంతో పనిచేస్తూ, గ్రామీణ మరియు సమస్యాత్మక ప్రాంతాలలో విస్తృతంగా ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు. వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, ప్రజలు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకుని, పాజిటివ్ అని తేలితే వెంటనే ఉచిత ఏఆర్టీ చికిత్స పొంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆయన పిలుపునిచ్చారు.

​జిల్లాలో హెచ్.ఐ.వి మరియు సిఫిలిస్ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడునని అధికారులు తెలిపారు. ప్రజలు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) లోని ఐ.సి.టి.సి రూమ్ నంబర్ 50, డి.ఎస్.ఆర్.సి రూమ్ నంబర్ 48 లేదా లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని రూమ్ నంబర్ 5 లో ఈ ఉచిత సేవలను వినియోగించుకోవచ్చని, మరిన్ని వివరాలకు 1098 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో ఎయిడ్స్ & లెప్రసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, దిశా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఎ. నీలిమ, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, సి.ఎస్.ఓ ఆర్. రాజేష్, ఐ.సి.టి.సి కౌన్సిలర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఎన్.జి.ఓ ప్రతినిధులు పాల్గొన్నారు