BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 16 July 2026, 09:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఊటుకూరులో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం.. మరో ద్విచక్ర వాహనానికి మంటలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jul, 2026 - 09:17 PM
131 వీక్షణలు

ఊటుకూరులో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం.. మరో ద్విచక్ర వాహనానికి మంటలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో గురువారం ఎలక్ట్రిక్ బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోని ఓ దుకాణం ముందు నిలిపిన ఎలక్ట్రిక్ బైక్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా కాలిపోగా, పక్కనే పార్క్ చేసిన మరో ద్విచక్ర వాహనానికి కూడా మంటలు అంటుకున్నాయి.

హఠాత్తుగా మంటలు ఎగసిపడటంతో అక్కడ ఉన్న వ్యాపారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నీరు, ఇసుకతో మంటలను అదుపులోకి తీసుకువచ్చి మరింత ప్రమాదం జరగకుండా నివారించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి కావడంతో యజమానులకు నష్టం వాటిల్లింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.