BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 18 April 2026, 10:07 am
Posted by : THUNIKI NAGARAJU

మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త..

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
Thuniki Nagaraju రాయికల్ మండల ప్రతినిధి
18 Apr, 2026 - 10:07 AM
247 వీక్షణలు

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పరిశుభ్రత దెబ్బతింటోంది. పట్టణాన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఉన్న సిబ్బందే ఇప్పుడు అపరిశుభ్ర పరిస్థితులకు కారణమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల నుండి చెత్తను సేకరించి ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. అయితే, ఈ ట్రాక్టర్లలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ట్రాక్టర్ల వెనుక భాగంలో తలుపులు (డోర్లు) లేకపోవడంతో, వాహనం కదులుతున్నప్పుడు చెత్త రోడ్డుపైనే పడిపోతోంది.

శనివారం ఉదయం శివాజీ బైపాస్ రోడ్డుపై వెళ్తున్న ఓ మున్సిపల్ ట్రాక్టర్ నుండి భారీగా చెత్త కింద పడటం స్థానికులు గమనించారు. ఉదయం రోడ్లను శుభ్రం చేసినా, ఇలాంటి నిర్లక్ష్యం వల్ల మళ్లీ రోడ్లు చెత్తతో నిండిపోతున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలికి చెత్త ఎగిరి కళ్లలో పడే ప్రమాదం ఉండటంతో ప్రమాదాల భయం కూడా నెలకొంది.

చెత్త తరలించే సమయంలో ట్రాక్టర్లకు కనీసం పరదాలు కప్పకపోవడం, డోర్లు సరిగా లేకపోవడం మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఒకవైపు “స్వచ్ఛ భారత్”, “స్వచ్ఛ రాయికల్” అంటూ ప్రచారాలు చేస్తూనే, క్షేత్రస్థాయిలో ఇలాంటి లోపాలను పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ మరియు సంబంధిత అధికారులు స్పందించి, చెత్త తరలించే వాహనాలకు సరైన డోర్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలని, రోడ్డుపై చెత్త పడకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.