BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 17 July 2026, 10:28 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గ్యాస్ లేకున్నా పోషకాహారం.. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 10:28 AM
106 వీక్షణలు

గ్యాస్ లేకున్నా పోషకాహారం.. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు

తిరువూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం తయారీలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. తిరువూరు ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 265 అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రలను పంపిణీ చేశారు.

గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా చిన్నారులకు పోషకాహారం తయారీలో ఆటంకం ఉండదని సీడీపీవో పి. కృష్ణకుమారి తెలిపారు. విద్యుత్తు ఉన్నప్పుడు ఇండక్షన్ స్టవ్లపై, విద్యుత్తు లేని సమయంలో యథావిధిగా గ్యాస్‌తో వంట చేసుకునేలా ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో వంట సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండక్షన్ స్టవ్లతో పాటు వాటిపై వంట చేసేందుకు అవసరమైన ప్రత్యేక పాత్రలను కూడా ప్రభుత్వం అందజేసింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వంట పని మరింత సులభమైంది.

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడింది. ఆ ప్రభావం అంగన్వాడీ కేంద్రాలపై కూడా పడటంతో, చిన్నారులకు పోషకాహారం అందించడంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లను అందించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సమస్యలు వచ్చినా సేవలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.

తిరువూరు ప్రాజెక్టు పరిధిలో చిన్నారుల వివరాలు:

తిరువూరు మండలం: 64 కేంద్రాలు – 3,161 మంది చిన్నారులు

గంపలగూడెం మండలం: 78 కేంద్రాలు – 2,875 మంది చిన్నారులు

ఏ. కొండూరు మండలం: 51 కేంద్రాలు – 2,367 మంది చిన్నారులు

విస్సన్నపేట మండలం: 72 కేంద్రాలు – 2,455 మంది చిన్నారులు

ఇండక్షన్ స్టవ్ల పంపిణీతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా చిన్నారులకు వేడి పోషకాహారం, ఉడకబెట్టిన గుడ్లు, వేడి పాలు అందించడంలో ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంగన్వాడీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.