BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 17 July 2026, 01:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలను పాఠశాలలో కవిబ్రహ్మ తిక్కన్న జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jul, 2026 - 01:03 PM
131 వీక్షణలు

పెనుగొలను పాఠశాలలో కవిబ్రహ్మ తిక్కన్న జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, పెనుగొలను: ప్రాథమిక బీసీ పాఠశాలలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో కవిబ్రహ్మ తిక్కన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో రెండో కవిగా ప్రసిద్ధి చెందిన తిక్కన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరసవెల్లి అనూష మాట్లాడుతూ తిక్కన్న 13వ శతాబ్దంలో నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి రాజుకు మంత్రిగా, ఆస్థాన కవిగా సేవలందించారని తెలిపారు. మహాభారతంలోని విరాటపర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను తెలుగులో రచించి తెలుగు సాహిత్యానికి చిరస్థాయిగా నిలిచారని వివరించారు.

కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు మాట్లాడుతూ తిక్కన్న రచించిన "నిర్వచనోత్తర రామాయణము" తొలి ప్రబంధాల్లో ఒకటిగా నిలిచిందని, దానిని మనుమసిద్ధి మహారాజుకు అంకితం చేశారని చెప్పారు.

సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ మాట్లాడుతూ తిక్కన్న కాలంలో శైవ, వైష్ణవ మతాల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు **"హరిహరనాథ తత్వం"**ను ప్రచారం చేశారని, శివుడు–విష్ణువు ఒకటేననే సందేశాన్ని సమాజానికి అందించారని పేర్కొన్నారు. తాను అనువదించిన మహాభారతాన్ని హరిహరనాథునికి అంకితం చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.

వేడుకల సందర్భంగా శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.