BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 05 August 2026, 06:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రభుత్వానికి నెట్‌వర్క్ ఆస్పత్రుల లేఖ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Aug, 2026 - 06:04 AM
56 వీక్షణలు

ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రభుత్వానికి నెట్‌వర్క్ ఆస్పత్రుల లేఖ

అమరావతి, ఆగస్టు 5: ఆరోగ్యశ్రీ పథకం కింద పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. సమ్మె సమయంలో ప్రతినెల రూ.170 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకు ఆ మేరకు నిధులు విడుదల చేయలేదని లేఖలో పేర్కొన్నాయి.

ప్రభుత్వం భారీగా బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సిబ్బందికి జీతాలు చెల్లించడం, మందులు, శస్త్రచికిత్సలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేయడం తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆస్పత్రుల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఐదు ప్రధాన డిమాండ్లను ఉంచాయి. తక్షణమే రూ.600 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ప్రతి నెల చెల్లింపులను క్రమబద్ధంగా నిర్వహించాలని కోరాయి. మిగిలిన బకాయిల విడుదలకు స్పష్టమైన కాలపరిమితితో కూడిన షెడ్యూల్ ప్రకటించాలని, సమస్యల పరిష్కారానికి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి.

అలాగే, పెండింగ్ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు హెచ్‌పీఆర్‌కు అనుసంధానమైన ఉచిత అనుమతుల ప్రక్రియను నిలిపివేయాలని కూడా నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.