BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్
Date of Publish : 28 September 2026, 03:27 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో నూతన బోరు బావి ఏర్పాటు తాగునీటి సమస్యకు కొంతమేర ఉపశమనం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Sep, 2026 - 03:27 PM
5 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల కేంద్రంలో తాగునీరు, వాడుక నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని నూతన బోరు బావిని ఏర్పాటు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో గ్రామంలో నీటి సమస్య తలెత్తడంతో మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నేత మందపాటి బసవా రెడ్డి ఈ విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి నూతన బోరు బావి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

మంత్రి సూచనల మేరకు మందపాటి బసవా రెడ్డి దగ్గరుండి బోరు బావి పనులను పర్యవేక్షించారు. బోరు బావిలో సుమారు రెండు అంగుళాల మేర నీరు పడటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ బోరు ద్వారా కొంతమేర ఉపశమనం కలిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి, బసవా రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

నూతనంగా ఏర్పాటు చేసిన బోరు బావిని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి బి. శివశంకర్ పరిశీలించారు. బోరు బావిలో నీరు పడటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు బోరు నీటిని అందుబాటులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా మందపాటి బసవా రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో తాగునీరు, వాడుక నీటి కొరత సమస్యను మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి బోరు బావి ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వేసవితో పాటు వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామంలో నీటి సమస్య ఏర్పడిందని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన బోరు బావిలో సుమారు రెండు అంగుళాల మేర నీరు పడటం సంతోషంగా ఉందన్నారు. బోరు నీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గడ్డం ప్రభాకర్ రెడ్డి, కుప్పిరెడ్డి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.