మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
Ntoday News: సెప్టెంబర్ 28:
మునగపాకలో ఎర్ర వెంకయ్య ఎద్దు సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. కొంతకాలంగా ఆ ఎద్దుకు సేవలు అందిస్తూ వచ్చిన వారు మృతి విషయం తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సింహాద్రి అప్పన్న స్వామిపై భక్తితో ఆ ఎద్దును అప్పన్న స్వామిగా పిలుచుకుంటూ సేవలు అందించినట్లు స్థానికులు తెలిపారు. ఎద్దు మృతితో దానితో అనుబంధం ఉన్న భక్తులు, సేవ చేసిన వారు భావోద్వేగానికి గురయ్యారు.
అప్పన్న స్వామిపై భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసంతో ఆ ఎద్దుకు సేవలు చేసిన వారు దాని మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా ఎద్దుకు నివాళులర్పిస్తూ, దాని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అప్పన్న స్వామి భౌతికంగా తమ మధ్య లేకపోయినా, దానితో ఉన్న అనుబంధం, భక్తి భావం ఎప్పటికీ గుర్తుండిపోతుందని వారు తెలిపారు.