BREAKING
thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Date of Publish : 11 October 2026, 02:34 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఎల్‌నినో, కరువు ప్రభావాలను ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
11 Oct, 2026 - 02:34 PM
3 వీక్షణలు

వచ్చే 8 నెలలకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు వచ్చే 8 నెలల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీరు, సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు నీటి భద్రత కల్పించాలని, నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. విద్యుత్ కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కరెంట్‌ను పొదుపుగా వినియోగించాలని, సాధ్యమైన చోట విద్యుత్ అధికంగా అవసరమయ్యే కార్యకలాపాలను వాయిదా వేయాలని అధికారులకు సూచించారు.

దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. కరువు పరిస్థితులు నెలకొన్నట్లు గుర్తించిన 215 మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరడంతో పాటు, VB-G RAM G పథకం కింద ప్రస్తుతం ఉన్న 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజులు కల్పించాలని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది.

పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వార్‌రూమ్, టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ అంశంపై మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో పాటు, అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు.