BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:13 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మహిళలు, బాలికల రక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
25 Nov, 2026 - 08:13 PM
14 వీక్షణలు

కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

కనిగిరి, నవంబర్ 25:

మహిళలు, బాలికలపై హింసను అరికట్టడం, వారికి రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఖాసీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మహిళలు, బాలికల భద్రత, హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించారు.

ఐక్యరాజ్యసమితి ఇచ్చిన “మహిళలు, బాలికలపై హింసను అంతం చేయడానికి ఏకం అవ్వండి – న్యాయాన్ని నిర్ధారించండి, బాధితులను రక్షించండి, నేరస్థులు శిక్ష నుంచి తప్పించుకోకుండా చూడండి” అనే పిలుపు ప్రాధాన్యతను వివరించారు.

మహిళలకు గౌరవం, సమానత్వం కల్పించాలి

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఖాసీం మాట్లాడుతూ మహిళలు, బాలికలపై జరిగే హింసను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మహిళలకు గౌరవం, సమానత్వం, భద్రత కల్పించే సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్, పారా లీగల్ వాలంటీర్ మండ్రు రమేష్ బాబు మాట్లాడుతూ గృహహింస, లైంగిక వేధింపులు, బాలికలపై దాడులు, ఆన్‌లైన్ వేధింపులను అరికట్టేందుకు సంబంధిత చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు. హింసకు గురైన మహిళలు, బాలికలు భయపడకుండా ముందుకు వచ్చి న్యాయ సహాయం పొందాలని సూచించారు. బాధితులకు అండగా నిలవడం, నేరాలపై స్పందించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన

మహిళలు, బాలికల రక్షణ కోసం అందుబాటులో ఉన్న అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు 112, మహిళా హెల్ప్‌లైన్ 181, బాలల హెల్ప్‌లైన్ 1098 గురించి విద్యార్థులకు వివరించారు. అవసరమైన సమయంలో ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

గుడ్ హెల్ప్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు, అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మహిళలపై హింసకు తావులేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.