BREAKING
thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్
Test 4
Date of Publish : 25 November 2026, 08:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

MTMC ఎన్నికల్లో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:11 PM
7 వీక్షణలు

ప్రతి పోలింగ్ బూతులో సీసీ కెమెరాలు తప్పనిసరి.. ఉల్లంఘనలు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి

ఓటు హక్కు లేని వ్యక్తులు బూతుల వద్ద కనిపిస్తే ఫొటోలు తీసి పోలీసులకు అందించాలి.. కార్యకర్తలు, ఏజెంట్లకు దొంతిరెడ్డి వేమారెడ్డి కీలక సూచనలు మంగళగిరి: మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంటీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా కార్యకర్తలు, అభిమానులు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మంగళగిరి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలను నిశితంగా గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, వాటి ఏర్పాటుపై సంబంధిత పోలింగ్ అధికారులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోతే వెంటనే పోలింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు లేని వ్యక్తులు అనవసరంగా సంచరించకుండా ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఓటు హక్కు లేని వ్యక్తులు బూతుల వద్ద కనిపిస్తే వారి వివరాలను ఫొటోల రూపంలో సేకరించి పోలీసులకు అందించాలని కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా పోలింగ్ అధికారి అనుమతి లేకుండా పోలీసులు లేదా ఇతర అధికారులు పోలింగ్ బూతుల్లో ఉండటానికి నిబంధనలు అనుమతించవని వేమారెడ్డి పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పోలింగ్ కేంద్రంలో ఉంటే వెంటనే ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకునే అధికారం ఆయనకు ఉంటుందని వివరించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా గుంపులుగా తిరగడం, ఓటర్లు కాని వ్యక్తులు ఓటింగ్ జరిగే ప్రాంతాల్లోకి ప్రవేశించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తిస్తే వాటికి సంబంధించిన ఆధారాలను వీడియోలు, ఫొటోల రూపంలో భద్రపరచాలని కోరారు. అవసరమైతే ఆ ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు కార్యకర్తలు, అభ్యర్థులు, ఏజెంట్లు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.