BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రామవరప్పాడులో ఆకాశంలో ఎగిరిన మంచం.. డ్రోన్‌తో సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:05 PM
8 వీక్షణలు

ఎన్నికల గుర్తునే గాల్లో ఎగరేస్తూ ఓటర్లను ఆకట్టుకున్న కొల్లా ఆనందకుమార్.. గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పెద్దపీట వేస్తానని హామీ విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజు వినూత్న ప్రచారం అందరినీ ఆకర్షించింది. సర్పంచ్ అభ్యర్థి కొల్లా ఆనందకుమార్ తన ఎన్నికల గుర్తు అయిన ‘మంచం’ను డ్రోన్‌కు అమర్చి గాల్లో ఎగురవేస్తూ ప్రచారం నిర్వహించారు. సాధారణంగా అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, సమావేశాల ద్వారా ఓటర్లను కలుస్తుండగా, అందుకు భిన్నంగా డ్రోన్ సాయంతో తన ఎన్నికల గుర్తును ఆకాశంలో ప్రదర్శిస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఆకాశంలో ఎగిరిన మంచాన్ని చూసి గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. ప్రచారంలో ఈ వినూత్న పద్ధతి ప్రత్యేక చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా కొల్లా ఆనందకుమార్ మాట్లాడుతూ గతంలో ఉపసర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామంలో సుమారు 30 సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేసినట్లు గుర్తుచేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులే తనకు అనుభవమని, మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే మరింత బాధ్యతతో పనిచేస్తానని తెలిపారు. తాను సర్పంచ్‌గా గెలుపొందితే ఏలూరు కాలువపై వంతెన నిర్మాణానికి కృషి చేయడంతో పాటు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుధ్య నిర్వహణ, అంతర్గత రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి రామవరప్పాడును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఎన్నికల గుర్తును వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన కొల్లా ఆనందకుమార్ ప్రచారం గ్రామంలో ఆసక్తికరంగా మారింది. ప్రచారం ముగింపు వేళ డ్రోన్‌తో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో ఓటర్లు తనకు మద్దతుగా నిలిచి మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.