BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:01 pm
Posted by : K MAHESH

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 08:01 PM
11 వీక్షణలు

బ్రాహ్మణ కొత్తపల్లిలో ఇందిరమ్మ నూతన గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్

నెల్లికుదురు | నవంబర్ 25

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమేనని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. బుధవారం నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో బెజ్జం వెంకటాద్రి–ప్రమీల దంపతులు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి, జిల్లా నాయకుడు నాయిని సత్యపాల్ రెడ్డి, స్థానిక ఉపసర్పంచ్ పిట్టల ఉప్పలయ్యతో కలిసి నూతన గృహాన్ని ప్రారంభించారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని పేర్కొన్నారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ బీమా, వడ్డీలేని రుణాలు, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.

గ్రామాభివృద్ధికి దశలవారీగా నిధులు

బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ అభివృద్ధికి దశలవారీగా నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల సతీష్, మండల నాయకుడు ఆకుతోట సతీష్, మాజీ వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్, మాజీ సర్పంచ్ పెరుమాండ్ల మల్లేశం గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి, గౌడ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు పెరుమాండ్ల శంకర్ గౌడ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.