BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:21 pm
Posted by : K MAHESH

ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 08:21 PM
7 వీక్షణలు

ఎంసీపీఐ(యు) పిలుపు మేరకు ఏఐసీటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం

కేసముద్రం, నవంబర్ 25:

ఎంసీపీఐ(యు) పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేసముద్రం మండల తహసీల్దార్‌కు ఎంసీపీఐ(యు)–ఏఐసీటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి, వాటిని ప్రజా అవసరాలకు వినియోగించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు పలు హామీలు ఇచ్చిందని పేర్కొన్నారు. భూమిలేని పేదలకు నివాస స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అవి అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. పేదలు నివసిస్తున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వడం లేదని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ అందడం లేదని ఆరోపించారు.

ప్రభుత్వ ఆస్తులను భవిష్యత్ తరాల అవసరాల కోసం కాపాడుతామని చెప్పిన ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు వినియోగించకుండా రియల్ ఎస్టేట్ సంస్థలు, కార్పొరేట్ వర్గాలకు అప్పగిస్తోందని కంచ వెంకన్న ఆరోపించారు.

ప్రభుత్వ భూముల వేలంపై అభ్యంతరం

ప్రభుత్వ ఆదాయ అవసరాల పేరుతో హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములను ప్లాట్లుగా చేసి వేలం వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ ప్రాంతాల్లోని భూముల వేలంతో పాటు టీజీ రాజీవ్ గృహ, గచ్చిబౌలి, పోచారం, బండ్లగూడ, రావిరాల, పరిగి, నల్లగొండ, కోకాపేట, మూసాపేట్ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను వేలం ద్వారా కార్పొరేట్, సంపన్న వర్గాలకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వ భూములను భవిష్యత్ తరాల అవసరాల కోసం పరిరక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధానాలను అమలు చేయాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వ భూముల వినియోగం

ప్రభుత్వ భూములను గృహవసతి, పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వంటి ప్రజా అవసరాల కోసమే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వేల్పుల వెంకన్న, సింగిరెడ్డి కర్ణాకర్, రాసంశెట్టి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.