BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:12 pm
Posted by : K MAHESH

కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 08:12 PM
14 వీక్షణలు

రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష.. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచన

కేసముద్రం, నవంబర్ 25:

వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత, ఐపీఎస్ బుధవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయంలోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన డీఐజీ.. కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడంతో పాటు నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని స్పష్టం చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేసముద్రం సీఐ వై. సత్యనారాయణ పూల మొక్కను అందించి డీఐజీ ఎన్. శ్వేతకు స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పించారు.

ఈ తనిఖీలో కేసముద్రం సీఐ వై. సత్యనారాయణ, ఎస్‌ఐ క్రాంతి కిరణ్, ఇనుగుర్తి ఎస్‌ఐ పి. నరేష్, నెల్లికుదురు ఎస్‌ఐ జి. కర్ణాకర్‌తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.