BREAKING
thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 07:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ధరణికృష్ణ ఆచూకీ తెలియడం లేదు.. నా కూతురు బతికుందో లేదో కూడా తెలియదు!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:52 PM
7 వీక్షణలు

సీఐడీ పోలీసులపై తల్లి నాగమణి సంచలన ఆరోపణలు.. పవన్ కల్యాణ్‌కు కన్నీటి విజ్ఞప్తి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ), జనసేన నాయకురాలు కోట రుక్మిణికి సంబంధించిన రూ.7 కోట్ల మోసం కేసు మరోసారి సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధరణికృష్ణ తల్లి నాగమణి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం రాజకీయ, పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన కుమార్తె పరిస్థితి ఏమిటో తెలియడం లేదని, ఆమె బతికుందో లేదో కూడా తెలియని దుస్థితిలో ఉన్నానంటూ నాగమణి కన్నీటిపర్యంతమయ్యారు. సీఐడీ పోలీసులు తమ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన కుమార్తెకు రూ.7 కోట్ల మోసం కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో కోట రుక్మిణి వద్ద పనిచేసిన ధరణికృష్ణ స్వచ్ఛందంగా తన వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిందని వెల్లడించారు. అయితే అక్కడికి వెళ్లిన తన కుమార్తెను మూడు రోజులపాటు పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని నాగమణి ఆరోపించారు. ఆడపిల్ల అనే కనికరం కూడా చూపకుండా, చెప్పుకోలేని ప్రదేశాల్లో బూటు కాళ్లతో తన్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులతో తమ కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురవుతోందని పేర్కొన్నారు. తన కుమార్తె ఆచూకీ, భద్రతపై ఇప్పటికీ ఆందోళన కొనసాగుతోందని తెలిపారు. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే తన కుమార్తెను విడుదల చేశారని నాగమణి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి తక్షణ రక్షణ కల్పించాలని, కేసు దర్యాప్తును ప్రస్తుత దర్యాప్తు సంస్థ నుంచి తప్పించి సీబీఐకి అప్పగించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను నాగమణి కన్నీటితో వేడుకున్నారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని, జరిగిన పరిణామాలపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. రూ.7 కోట్ల మోసం కేసులో ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు పోలీసుల వేధింపులంటూ బాధితురాలి తల్లి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే నాగమణి చేసిన ఆరోపణలపై సంబంధిత పోలీసు అధికారుల వివరణ, అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఆరోపణల వాస్తవాలు సమగ్ర విచారణలో తేలాల్సి ఉంది.