BREAKING
thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు thumb ● రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలి thumb ● సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మురళీ నియామకం thumb ● కొత్తగూడెం యువకుడు నీల మహేష్‌కు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హత thumb ● జినుకల రాములమ్మకు యాదవ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కమిటీ నివాళులు thumb ● రామన్నపేట రైల్వే స్టేషన్‌లో నారాయణాద్రి, పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలి thumb ● సింగారంలో భూ రీ సర్వే పనులపై ఆర్డీఓ పరిశీలన thumb ● పైళ్ల ప్రతాప్ రెడ్డికి సీపీఎం నాయకుల నివాళులు
Test 4
Date of Publish : 25 November 2026, 07:36 pm
Posted by : K MAHESH

రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా?

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
25 Nov, 2026 - 07:36 PM
6 వీక్షణలు

డ్రైనేజీ నిర్మాణం నిలిచిపోవడంతో 13వ వార్డు ప్రజలకు ఇబ్బందులు.. మురుగునీరు, తాగునీటి సమస్యలతో అవస్థలు

బయ్యారం | నవంబర్ 25

అభివృద్ధి పనులకు ఎదురవుతున్న అడ్డంకులతో బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని 13వ వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఏళ్లుగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం డీఎల్‌పీఓతో పాటు ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్, సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడం లేదని చెబుతున్నారు.

నిధులు మంజూరైనా ముందుకు సాగని డ్రైనేజీ పనులు

డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఓ వ్యక్తి అభ్యంతరాల కారణంగా పనులు ముందుకు సాగడం లేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. మురుగునీరు నిల్వ ఉండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మిషన్ భగీరథ పైప్‌లైన్లు దెబ్బతినడంతో తాగునీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా బావులు, బోర్లు అందుబాటులో లేకపోవడంతో తాగునీటి అవసరాల కోసం పూర్తిగా మిషన్ భగీరథపైనే ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు.

అభివృద్ధి పనుల జాప్యంపై భిన్నాభిప్రాయాలు

సర్పంచ్ గుగులోతు శాంతి కిషన్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఎదురవుతున్న అడ్డంకులపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పనుల జాప్యానికి రాజకీయ విభేదాలు కూడా కారణమా అనే చర్చ జరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. అయితే పనులు నిలిచిపోవడానికి గల అసలు కారణాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

13వ వార్డులో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను ఇకనైనా పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాలని, డ్రైనేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.