BREAKING
thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 07:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మహిళకు భద్రత లేని అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:51 PM
5 వీక్షణలు

మహిళలపై హింస నిర్మూలనకు బాల్యం నుంచే గౌరవ భావన పెంపొందించాలి – రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ విజయాలు సాధిస్తున్నప్పటికీ, ఇప్పటికీ అనేక వ్యవస్థల్లో పురుషాధిపత్యం కొనసాగుతుండటం ఆందోళన కలిగించే అంశమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మహిళలకు సంపూర్ణ భద్రత, గౌరవం, సమాన అవకాశాలు కల్పించలేని సమాజంలో జరిగే అభివృద్ధిని నిజమైన అభివృద్ధిగా పరిగణించలేమని స్పష్టం చేశారు. మహిళలపై హింసను నిర్మూలించేందుకు చట్టాల అమలుతో పాటు సమాజంలో ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా నవంబర్ 25న నిర్వహించే మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, ధర్మపీఠం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాయపాటి శైలజ మహిళల భద్రత, హక్కులు, చట్టాలు, సమాజంలో మారాల్సిన ధోరణులపై కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలను గౌరవించడం, వారి పట్ల సమానత్వ భావన కలిగి ఉండటం అనేది బాల్యం నుంచే పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఇంటి నుంచే ఆడపిల్లలు, మగపిల్లల మధ్య వివక్ష లేకుండా పెంపకం సాగాలని, స్త్రీలను గౌరవించే సంస్కారాన్ని చిన్నతనం నుంచే అలవాటు చేస్తే భవిష్యత్తులో మహిళలపై హింసను చాలావరకు నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. మహిళలపై హింస అంటే కేవలం శారీరక దాడులే కాదని, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ వేదికల ద్వారా వేధింపులకు పాల్పడటం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిత్వాన్ని కించపరచడం కూడా మానసిక హింస కిందకే వస్తాయని వివరించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం దేశంలో అనేక చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, వాటిపై సరైన అవగాహన లేకపోవడం, అవసరమైన సమయంలో వాటిని వినియోగించుకోలేకపోవడం వల్ల వేధింపులు, హింస కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతి మహిళ తన హక్కులు, చట్టపరమైన రక్షణ మార్గాల గురించి తెలుసుకోవాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం నేటి సమాజంలో ఒక ముఖ్యమైన జీవన నైపుణ్యంగా భావించాలని సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ శక్తి యాప్, మహిళా పోలీసు పెట్రోలింగ్ వంటి చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు 181 మహిళా సహాయవాణి, 112 అత్యవసర సేవలతో పాటు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులకు వివరించారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా మౌనంగా భరించకుండా అందుబాటులో ఉన్న సహాయ వ్యవస్థలను వినియోగించుకోవాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ త్రిమూర్తులు మాట్లాడుతూ విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న మహిళా చైతన్య కార్యక్రమాలను కేవలం విద్యార్థులకే పరిమితం చేయకుండా సమాజంలోని సామాన్య మహిళల వద్దకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు తమ హక్కులపై అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ధర్మపీఠం వంటి సేవా సంస్థలు మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. విశ్వవిద్యాలయ రెక్టార్ ఆర్. శివరామ ప్రసాద్ గౌరవ అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలోని ప్రతికూల పరిస్థితులకు మహిళలు వెనుకడుగు వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చట్టాలు మహిళలకు రక్షణగా ఉన్నాయని, వాటిపై నమ్మకంతో నిర్భయంగా విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విశ్వవిద్యాలయ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ విమల ప్రత్యేక అతిథిగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ వాటిని ఉపయోగించుకునే స్థితిలో మహిళలందరూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు మానసికంగా బలోపేతం కావడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్, కార్యక్రమ నిర్వాహకురాలు ప్రొఫెసర్ ఈ. భవాని మాట్లాడుతూ విద్య అనేది కేవలం అర్హత సాధించేందుకు మాత్రమే పరిమితం కాదని, మహిళల సాధికారతకు అది అత్యంత శక్తివంతమైన సాధనమని అన్నారు. ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకోవడంతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించాలని సూచించారు. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగినప్పుడే మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, తమపై జరిగే దాడులు, అన్యాయాలను ధైర్యంగా ప్రతిఘటించే శక్తి వస్తుందని పేర్కొన్నారు. ధర్మపీఠం జాతీయ న్యాయ సలహాదారు గంటా సతీష్ కుమార్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ వేదికల ద్వారా మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు అనేక చట్టపరమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వాటిపై అవగాహన పెంచుకొని సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య తీవ్రత పెరగకముందే అడ్డుకోవచ్చన్నారు. మహిళల రక్షణకు సంబంధించి తాను పరిశోధించి రూపొందించిన న్యాయపరమైన సమాచార పత్రాలను కార్యక్రమానికి హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ధర్మపీఠం అధ్యక్షులు శెట్టిపల్లి శశికిరణ్ నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ మహిళా ప్రొఫెసర్లు, మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సురేష్ కుమార్, ధర్మపీఠం కార్యవర్గ సభ్యులు సంపతి సంతోష్ కుమార్, తాళ్లూరి ప్రహర్షిత, యర్రంశెట్టి శ్రీనివాస్, విశ్వవిద్యాలయ విద్యార్థినులు హర్షిత, నేహా తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, కుటుంబం నుంచి విద్యాసంస్థల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే హింస లేని సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.