BREAKING
thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 07:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 07:48 PM
6 వీక్షణలు

2,100 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా.. 9 వేల మంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. ఎన్నికల విధుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పరిశీలించి ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలోని 288 గ్రామ పంచాయతీలు, 3,088 వార్డులకు సంబంధించి సుమారు 9 వేల మంది పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. తొలి దశలో ఐదు గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు, రెండో దశలో సుమారు 11 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా గుర్తించిన 2,100 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి, కమిషన్ స్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. అదనంగా సుమారు 600 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించడంతో పాటు సాధారణ పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రత్యేక చిత్రీకరణ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా సమస్యలు, సందేహాలు తలెత్తితే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన నియంత్రణ గది 91549 70454 నంబర్‌కు లేదా క్షేత్రస్థాయిలోని రిటర్నింగ్ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల సజావుగా సాగేందుకు అధికారులకు సహకరించాలని కోరారు. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలను పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.