BREAKING
thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● అయ్యప్ప స్వామి ఆలయ భూమి పూజకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● ఎడ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ thumb ● రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకమా? thumb ● పైప్‌లైన్ పనులు పూర్తయ్యాకే హైవే నిర్మాణ పనులు ప్రారంభించాలి
Test 4
Date of Publish : 25 November 2026, 07:48 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

బాలానగర్‌లో రేపు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

తెలంగాణ
25 Nov, 2026 - 07:48 PM
5 వీక్షణలు

ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం.. పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రధాన కార్యదర్శి కొండకళ్ల విష్ణువర్ధన్ పిలుపు

బాలానగర్ | నవంబర్ 25

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26, గురువారం బాలానగర్ మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించనున్నట్లు మండల అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి కొండకళ్ల విష్ణువర్ధన్ తెలిపారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించడంతో పాటు రాజ్యాంగ విలువలు, ఆశయాలను స్మరించుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

ఈ వేడుకలకు అంబేద్కర్ సంఘం సభ్యులు, యువకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొండకళ్ల విష్ణువర్ధన్ కోరారు.