BREAKING
thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం
Date of Publish : 11 October 2026, 02:32 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పెళ్లి పేరుతో లైంగిక వేధింపుల ఆరోపణలు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
11 Oct, 2026 - 02:32 PM
6 వీక్షణలు

పెళ్లి పేరుతో లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీసు అధికారిపై కేసు నమోదు

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2017 నుంచి తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్‌లో డీఐగా పనిచేస్తున్న బాలస్వామిపై సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో సంబంధం కొనసాగించాడని మహిళ ఆరోపించింది. తన భర్త మరణించిన తర్వాత కూడా వివాహం చేసుకుంటానని నమ్మించి సంబంధాన్ని కొనసాగించాడని తెలిపింది. అయితే, పెళ్లి చేసుకోవాలని నిలదీయగా నిరాకరించాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

మహిళ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని 69, 81, 351(2), 352 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కేసులోని ఆరోపణలు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. విచారణ పూర్తయి, సంబంధిత ఆధారాలు పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.