BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:44 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భర్తను పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:44 AM
33 వీక్షణలు

విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం.. పోలీసుల విచారణలో బయటపడిన హత్యోదంతం సంగారెడ్డి జిల్లా: కుటుంబ కలహాలు చివరకు దారుణ హత్యకు దారితీశాయి. మద్యం తాగి నిత్యం గొడవపడుతూ వేధిస్తున్నాడనే కోపంతో ఓ భార్య తన భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. హత్య చేసిన అనంతరం భర్త విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు నమ్మించేందుకు ఆమె చేసిన ప్రయత్నం పోలీసుల దర్యాప్తుతో బయటపడింది. కంగ్టి మండలం దెగుల్‌వాడి గ్రామానికి చెందిన జరప్ప (46) ఈ నెల 10న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఆయన విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు భావించారు. అయితే మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులో నిద్రిస్తున్న జరప్పపై భార్య బుజ్జమ్మ పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం తన నేరం బయటపడకుండా ఉండేందుకు మంచంపై విద్యుత్ వైర్లు ఉంచి, విద్యుత్ షాక్ తగిలి భర్త మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. భర్త రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవపడుతూ వేధిస్తున్నాడనే ఆగ్రహంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు బుజ్జమ్మ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. సాక్ష్యాలను తారుమారు చేసి సహజ మరణంగా చిత్రీకరించాలన్న ప్రయత్నం పోలీసుల విచారణతో విఫలమైంది. దీంతో నిందితురాలు బుజ్జమ్మను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. విద్యుత్ షాక్ మరణంగా భావించిన ఘటన చివరకు పథకం ప్రకారం జరిగిన హత్యగా తేలడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.