www.ntodaynews.com
హోలీ వేడుకల్లో పాల్గొన్న బీర్ల అయిలయ్య
తెలంగాణ
గిరిజన తండాలో హోలీ వేడుకల్లో పాల్గొన్న బీర్ల అయిలయ్య
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా
బంజారాలతో కలిసి సంప్రదాయ నృత్యాలు
బొమ్మలరామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.
హోలీ సందర్భంగా తండా వాసులతో కలిసి రంగులు చల్లుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. బంజారా సోదర సోదరీమణులతో కలిసి సంప్రదాయ నృత్యాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ హోలీ పండుగ సోదరభావం, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. గోవింద్ తండా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు.
తండా వాసులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.
మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మండల అధ్యక్షుడు సింగిర్తి మల్లేశం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దాసరి సూర్యప్రకాశ్ రెడ్డి, గోవింద్ తండా సర్పంచ్ మంగ్త్య నాయక్, ఉప సర్పంచ్ రాజేష్ నాయక్, మహిళా అధ్యక్షురాలు సునీత, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు నాయక్, రామిడి జంగారెడ్డి, మాజీ సర్పంచులు యంజాల కళ, తిరుమల కవిత వెంకటేష్ గౌడ్, కృష్ణారెడ్డి, బాసారం శ్రీరాములు, రామిడి రామిరెడ్డి, వెంకటేష్, శ్రీకాంత్ తదితర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Bommalaramaram #Aleru #BeerlaAilaiah #Holifestival #YadadriBhuvanagiri #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube