BREAKING
thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి thumb ● ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా? thumb ● రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు బడ్జెట్ కేటాయించాలి thumb ● తొట్టంబేడు మండలంలో రావెళ్ల మునిరాజా నాయుడు విస్తృత ప్రచారం thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి thumb ● ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా? thumb ● రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు బడ్జెట్ కేటాయించాలి thumb ● తొట్టంబేడు మండలంలో రావెళ్ల మునిరాజా నాయుడు విస్తృత ప్రచారం thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
మంచి మాట
Date of Publish : 03 November 2026, 09:08 am
Posted by : KOLA MAHESH

రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు బడ్జెట్ కేటాయించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 09:08 AM
17 వీక్షణలు

సీపీఎం పాదయాత్రకు సీపీఐ సంఘీభావం.. రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్

నారాయణపురం, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లాలో రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు అనుమతులు మంజూరు చేసి, నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయించాలని కోరుతూ సీపీఎం పార్టీ చేపట్టిన పాదయాత్ర నారాయణపురం మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకులు పాదయాత్రకు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు.

నీటి కోసం సుదీర్ఘ పోరాటం చేశాం

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ జిల్లా సమితి సభ్యుడు చిలువేరు అంజయ్య మాట్లాడుతూ.. కృష్ణా జలాల కోసం గత 30 సంవత్సరాలుగా సీపీఐ పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. 2003లో డిండి నుంచి నల్లగొండ వరకు పాదయాత్ర నిర్వహించినట్లు గుర్తుచేశారు.

2007లో అంగడిపేటలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిర్వహించిన బహిరంగ సభకు నారాయణపురం మండలంలోని సర్వేలు గ్రామస్తులు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ వెళ్లారని తెలిపారు. ఆ సందర్భంగా బాజా నరసన్న, పంది ముత్యాలు, షేక్ జాంగిర్, కట్టల యాదన్న ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

శ్రీశైలం సొరంగ మార్గం కోసం పోరాటం

2013లో కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి, పళ్ళ వెంకట్‌రెడ్డి, నెల్లికంటి సత్యం, గులాం రసూల్ తదితరుల నాయకత్వంలో నక్కలగండి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించినట్లు అంజయ్య తెలిపారు. శ్రీశైలం సొరంగ మార్గం కోసం కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేసిందని వివరించారు.

అదేవిధంగా శివన్నగూడ నుంచి నారాయణపురం మండలంలోని రాచకొండ ప్రాంతంలో రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని కోరుతూ జీపు జాత, మహాధర్నా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తుచేశారు.

రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి

రాచకొండలో రిజర్వాయర్ నిర్మించకపోతే నారాయణపురం మండలంలోని వ్యవసాయ భూములు సాగునీరు లేక బీడుగా మారే ప్రమాదం ఉందని అంజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు అనుమతులు ఇచ్చి, అవసరమైన నిధులు కేటాయించి నిర్మాణాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

పాదయాత్రకు పలువురి సంఘీభావం

ఈ కార్యక్రమంలో పందుల యాదగిరి, గడ్డం యాదగిరి, సింగపంగ మల్లన్న, దూసర్ల సత్యనారాయణ, హమాలి అంజయ్య, కందుల మోహన్, ఆటో అంజన్న, రాపర్తి పెంటయ్య తదితరులు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.