BREAKING
thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి thumb ● ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా? thumb ● రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు బడ్జెట్ కేటాయించాలి thumb ● తొట్టంబేడు మండలంలో రావెళ్ల మునిరాజా నాయుడు విస్తృత ప్రచారం thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి thumb ● ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా? thumb ● రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు బడ్జెట్ కేటాయించాలి thumb ● తొట్టంబేడు మండలంలో రావెళ్ల మునిరాజా నాయుడు విస్తృత ప్రచారం thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
మంచి మాట
Date of Publish : 03 November 2026, 09:30 am
Posted by : KOLA MAHESH

మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక!

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 09:30 AM
19 వీక్షణలు

నాలుగు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ అప్రమత్తత అవసరం

భువనగిరి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): మురసు తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

నాలుగు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 120 నుంచి 150 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.

మరో ఏడు జిల్లాల్లోనూ వర్షాలు

నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు సమాచారం.

ఉరుములు, మెరుపులు.. ఈదురుగాలుల పట్ల జాగ్రత్త

తుఫాన్‌ ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ప్రత్యేక దృష్టి

నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు. భారీ వర్షాల సమయంలో వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు.