ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి?
హుజూర్‌నగర్‌కే ఇరిగేషన్ నిధులా? మునుగోడు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అసహనం
మునుగోడు, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారా? లేక హుజూర్‌నగర్ నియోజకవర్గానికే మంత్రిగా ఉన్నారా? అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించారు.
మంత్రుల నియోజకవర్గాలకే నిధులా?
సోమవారం మునుగోడులో జరిగిన కార్యక్రమంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకే కేటాయిస్తున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రతి వంద ఎకరాలకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు.
మునుగోడు అభివృద్ధికి నిధులివ్వాలి
మునుగోడు నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు చేపట్టాలంటే తానే వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాల్సి వస్తోందని రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి అవసరమైన నిధులు కేటాయించి సాగునీటి, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు.
సొంత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల విషయంలో పోరాడాల్సి వస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.