BREAKING
thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి thumb ● ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా? thumb ● రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు బడ్జెట్ కేటాయించాలి thumb ● తొట్టంబేడు మండలంలో రావెళ్ల మునిరాజా నాయుడు విస్తృత ప్రచారం thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి thumb ● ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా? thumb ● రాచకొండ లెఫ్ట్ ఇరిగేషన్ పనులకు బడ్జెట్ కేటాయించాలి thumb ● తొట్టంబేడు మండలంలో రావెళ్ల మునిరాజా నాయుడు విస్తృత ప్రచారం thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
మంచి మాట
Date of Publish : 03 November 2026, 09:28 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దీపావళి టపాసుల దుకాణాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Nov, 2026 - 09:28 AM
8 వీక్షణలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ హెచ్చరిక

చాట్రాయి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): దీపావళి పండుగను పురస్కరించుకొని మండలంలోని వివిధ గ్రామాల్లో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలని చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ సూచించారు. ఈనెల 8వ తేదీన దీపావళి పండుగ జరగనున్న నేపథ్యంలో టపాసుల విక్రయదారులు ముందస్తుగా అవసరమైన లైసెన్సులు పొందాలని స్పష్టం చేశారు. టపాసుల దుకాణాల వద్ద అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. దుకాణాల వద్ద నీటి డ్రమ్ములు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. నివాస ప్రాంతాలకు దూరంగా, నిబంధనలకు అనుగుణమైన ప్రదేశాల్లోనే టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసుల అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసినా, భద్రతా నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై డి. రామకృష్ణ హెచ్చరించారు. ప్రజలంతా భద్రతా నియమాలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన కోరారు.