www.ntodaynews.com
వర్కర్స్ యూనియన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
తెలంగాణ
సుందరయ్య భవన్‌లో తెలంగాణ భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
NTODAY NEWS: భువనగిరి పట్టణం
భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్‌లో గురువారం తెలంగాణ భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ మరియు డైరీని ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండు, గొరిగి సోములు మాట్లాడుతూ—
దేశంలో కార్మిక వర్గం హక్కులను కాలరాస్తూ, కార్మికులను కేవలం చాకిరీకి పరిమితం చేసే విధానాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. కార్మికులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం బలహీనపరుస్తున్నారని ఆరోపించారు.
కార్మికులకు సంఘాలు, యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కును హరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు సాధించుకున్న వలస కార్మికుల చట్టాలు, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేసే చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు మాతయ్య, భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రాధారం మల్లేశం, నాయకులు వెంకటేశం, ఈశ్వరయ్య, మారయ్య, రాధాకృష్ణ, ఎల్లా స్వామి, ప్రసాద్, ఎస్.కే. శీను తదితరులు పాల్గొన్నారు.
#WorkersUnion
#ConstructionWorkers
#LabourRights
#TradeUnion
#CITU
#WorkersWelfare
#Bhongir
Follow us on
Website
Facebook
Instagram
YouTube